మహిళ అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

మహిళ అదృశ్యం

Dec 26 2025 8:21 AM | Updated on Dec 26 2025 8:21 AM

మహిళ

మహిళ అదృశ్యం

కృష్ణగిరి: కోయిలకొండ గ్రామానికి చెందిన బోయ కొసనాపల్లె లక్ష్మీదేవి(45) రెండు రోజుల నుంచి కనిపించడం లేదని ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు. గ్రామానికి చెందిన కొసనాపల్లె సుంకన్న, లక్ష్మీదేవి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా లక్ష్మీదేవికి మానసికస్థితి సరిగాలేక గతంలో పలుమార్లు ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లి తిరిగి వస్తుండేది. కానీ ఈ నెల 24న ఉదయం ఇంటి నుంచి బయలు దేరి డోన్‌కు చేరుకుని అక్కడి నుంచి బస్సులో కర్నూలు వైపు వెళ్లినట్లు కుటుంబీకులు తెలుసు కుని విచారించినా ఆచూకీ లభించలేదు. దీంతో భర్త సుంకన్న పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. 5.2 అడుగుల ఎత్తు, నలుపు రంగు ఉండి, ఇంటి నుంచి వెళ్లినప్పుడు వంకాయపూత కలర్‌ చీర, నెత్తిన తెల్ల టవాలు వేసుకుని వెళ్లిందన్నారు. ఎవరైనా గుర్తిస్తే వెల్దుర్తి సీఐ 9121101118, కృష్ణగిరి ఎస్‌ఐ 9121101117కు సమాచారం ఇవ్వాలన్నారు.

ప్యాపిలిలో రెండిళ్లలో చోరీ

ప్యాపిలి: పట్టణంలోని స్థానిక హుసేనాపురం వీధిలో గురువారం తెల్లవారుజామున రెండిళ్లలో చోరీ జరిగింది. పట్టణానికి చెందిన సూర్యనారాయణ రెడ్డి ఇంటి తాళాలు పగులగొట్టిన దుండగులు 2.5 తులాల బంగారు నగలు, 20 తులాల వెండి నగలు చోరీ చేశారు. ఇదే వీధిలో ఉంటున్న పెద్దయ్య ఇంట్లో చొర బడి అర తులం బంగారు, 10 తులాల వెండి అపహరించారు. సూర్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి కొద్ది రోజుల క్రితం కాశీకి వెళ్లాడు. గురువారం తిరిగి వచ్చిన ఆయ న ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెద్దయ్య కూడా కుటుంబ సభ్యులతో కలసి బంధువుల ఊరికి వెళ్లాడు. మరో రెండు ఇళ్లలోనూ దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ వెంకటరామిరెడ్డి, ఎస్‌ఐ నాగార్జున దొంగతనం జరిగిన ఇళ్లను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

కోడుమూరు రూరల్‌: కర్నూలు – కోడుమూరు రహదారిలో ప్యాలకుర్తి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్యాలకుర్తి చెందిన గౌరయ్య కుమారుడు రెడ్డిపోగు యశ్వంత్‌ (27), సంగాల నాగేష్‌ క్రిస్మస్‌ సందర్భంగా బట్టలు కొనేందుకు కోడుమూరుకు బైక్‌పై బయలుదేరారు. ఇదే సమయంలో కర్ణాటక నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న కారు మార్గమధ్యలో ప్యాలకుర్తి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద బైక్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న యశ్వంత్‌, నాగేష్‌కు తీవ్ర గాయాలవ్వగా, చికిత్స నిమిత్తం కర్నూ లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక యశ్వంత్‌ మృతిచెందాడు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. కాగా క్రిస్మస్‌ పండుగ వేళ ప్యాలకుర్తి గ్రామానికి చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, మరొక యువకుడు తీవ్రంగా గాయపడడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి గౌరయ్య ఫిర్యాదు మేరకు కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తిపై కత్తితో దాడి

బొమ్మలసత్రం: మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడి కత్తితో దాడి చేసుకున్న సంఘటన గురువారం నంద్యాల పట్టణంలో చోటు చేసుకుంది. త్రీటౌన్‌ పోలీసులు తెలిసిన వివరాల మేరకు.. దేవనగర్‌కు చెందిన సుంకన్న, విజయ్‌ స్నేహితులు. ఇద్దరు కలిసి మధ్యాహ్నం మద్యం సేవించి మద్యం మత్తులో ఘర్షణ పడ్డా రు. ఈ క్రమంలో విజయ్‌ తన వద్ద ఉన్న కత్తితో సుంకన్నను కడుపులో పొడిచాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని స్థానికులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పో లీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మహిళ అదృశ్యం 1
1/2

మహిళ అదృశ్యం

మహిళ అదృశ్యం 2
2/2

మహిళ అదృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement