ఓటెత్తాలి! నేడే మలిదశ మునిసిపల్, తొలిదశ పంచాయతీ ఎన్నికలు ● తాడిగడప, గుడివాడ పురాల్లో
ఏర్పాట్లు పూర్తి
● గుడివాడ రెవెన్యూ డివిజన్‌లోని
పంచాయతీల్లోనూ సర్వం సిద్ధం
● సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది
● పర్యవేక్షించిన కలెక్టర్ డీకే బాలాజీ ● గుడివాడ, తాడిగడప మునిసిపాలిటీలో పోలింగ్ ప్రక్రియకు సంబంధించి 1660 మంది సిబ్బందిని నియమించారు.
● గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికలకు సుమారు 3వేల మంది సిబ్బందిని నియమించారు.
● పోలీస్ బందోబస్తు నిర్వహణకు రెండు మునిసిపాలిటీల్లో ముగ్గురు ఏఎస్పీలు, 14 మంది సీఐలు, 32 మంది ఎస్‌ఐలు, 12మంది ఏఎస్‌ఐలు, 78 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 189 మంది కానిస్టేబుళ్లు, 40మంది ఏఆర్ సిబ్బంది, 99 మంది హోంగార్డులను నియమించారు.
● పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇరువురు ఏఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, 16మంది సీఐలు, 54మంది ఎస్‌ఐలు, 60 మంది ఏఎస్‌ఐలు, 140 మంది హెడ్‌కానిస్టేబుళ్లు,40 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 30 మంది ఏఆర్ సిబ్బంది, 226 మంది హోంగార్డులను నియమించారు.
ఫీజు చెల్లింపునకు
వచ్చేనెల 5 వరకూ అవకాశం మచిలీపట్నంఅర్బన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఎస్‌ఎస్‌సీ, ఓఎస్‌ఎస్‌సీ, వొకేషనల్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఒకసారి పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు(వన్‌టైమ్ ఫెయిల్డ్) కూడా ఈ షెడ్యూల్ ప్రకారం ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఆలస్య రుసుము లేకుండా గురువారం నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 6 నుంచి 9వ తేదీ వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 10 నుంచి 13వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 14 నుంచి 18వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. పరీక్ష ఫీజులను ఆన్‌లైన్ ద్వారా చెల్లించి, సంబంధిత వివరాలను ధ్రువీకరించుకోవాలని సూచించారు. పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెరగాలి లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెలివరీలను మరింతగా పెంచాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ. శ్రావణ్‌బాబు అన్నారు. రోగి కేంద్రీకృత ఆరోగ్య సంరక్షణ సేవలను అందించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలోని జి. కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఏఎన్‌ఎంలు, ఆశాలు, ల్యాబ్ టెక్నీషియన్‌లతో బుధవారం డీఎంహెచ్‌ఓ సెక్టార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ ఐడీతో గర్భిణుల రిజిస్ట్రేషన్, వ్యాధి నిరోధక టీకాల సెషన్ల నిర్వహణ, సెషన్లలో అనాఫిలాక్సిన్ కిట్లు, ప్రధాన కార్యాలయంలో ఏఈఎఫ్‌ఐ కిట్‌ను అందుబాటులో ఉంచడంపై వివరించారు. అలాగే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రయోజనాలను ఏఎన్‌ఎంలకు వివరించారు. ఇ–సంజీవనితో ప్రజలకు, ఆరోగ్య సిబ్బందికి కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆంజనేయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
29న ఓపెన్ చెస్ టోర్నమెంట్ నేడు రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో రెండు మునిసిపాలిటీలతో పాటు గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పంచాయతీల్లో ఎన్నికలు గురువారం జరగనున్నాయి. మునిసిపాలిటీల్లో ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. పంచాయతీల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు వెల్లడించనున్నారు.
మలి విడత మునిసి‘పోల్స్’.. ఇటీవల జరిగిన మునిసిపల్ పోరులో తాడిగడప, గుడివాడ మునిసిపాలిటీలకు న్యాయపరంగా ఇబ్బందులు ఉండటంతో వీటికి ఎన్నికలు నిలిపివేశారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ రెండు మునిసిపాలిటీలకు గురువారం పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు.
● గుడివాడ మునిసిపాలిటీకి సంబంధించి చైర్మన్‌తో పాటు 48 కౌన్సిలర్ల స్థానాలకు గానూ 1,19,594 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 56,538 మంది పురుషులు, 63,048మంది మహిళలు, 11 మంది ఇతరులు ఉన్నారు. వీరి కోసం 134 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
● తాడిగడప మునిసిపాలిటీకి సంబంధించి చైర్మన్, 48 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా 2వ వార్డు కౌన్సిలర్ స్థానం ఏకగ్రీవం కావటంతో 47వార్డుల్లోని కౌన్సిలర్ స్థానాలు ఎన్నికలు జరగనున్నాయి. 1,38,576 మంది ఓటు హక్కు వినియోగించాల్సి ఉండగా 67,575 మంది పురుషులు, 71,000 మంది మహిళలు, ఇతరులు ఒకరు ఉన్నారు. వీరి కోసం 144 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మొదటి దశ గుడివాడ డివిజన్‌లో.. జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గురువారం గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. గుడివాడ డివిజన్‌లోని బాపులపాడు, గన్నవరం, గుడ్లవల్లేరు, నందివాడ, ఉంగుటూరు, గుడివాడ మండలాల్లోని గ్రామాల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మండలాల్లో 136 సర్పంచ్ స్థానాలకు గానూ 15 ఏకగ్రీవం కాగా 121 స్థానాలకు 305 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,304 వార్డు సభ్యులకు గానూ 362 ఏకగ్రీవంగా కాగా 942 స్థానాలకు 1,960 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు 1,342 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు.
ఎన్నికల సామగ్రి పంపిణీ.. మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి గుడివాడ మునిసిపాలిటీకి సంబంధించి వీకేఆర్ అండ్ వీఎన్‌వీ ఇంజినీరింగ్ కళాశాల, తాడిగడప మునిసిపాలిటీ పరిధిలోని పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ బాలాజీ బుధవారం పరిశీలించారు. అలాగే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుడ్లవల్లేరు టీటీడీ కల్యాణ మండపం, గుడివాడ వ్యవసాయ మార్కెట్ యార్డు, నందివాడ జెడ్పీహెచ్‌ఎస్, బాపులపాడు జెడ్పీహెచ్‌ఎస్, గన్నవరం జెడ్పీహెచ్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి కేంద్రాలను పరిశీలించి ఎన్నికల సిబ్బందికి సూచనలు జారీ చేశారు. పోలింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని, పొరపాట్లు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
న్యూస్‌రీల్
వివాదాలకు కేంద్రంఽగా..
సిబ్బంది నియామకం ఇలా..
సమయం ఏదైనా
అందుబాటులో లిక్కర్
విజయవాడలో ఏరులై
పారుతున్న మద్యం
నేడే మలిదశ మునిసిపల్, తొలిదశ పంచాయతీ ఎన్నికలు
గురువారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2026
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పోరంకిలోని గ్రీన్ స్కూల్ ఆవరణలో ఈ నెల 29న ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామని కృష్ణాజిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ ఎం.దివ్య చెప్పారు. గ్రీన్ స్కూల్ ఆవరణలో టోర్నమెంట్‌కు సంబంధించిన బ్రోచర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల నుంచి చెస్ క్రీడాకారులు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనవచ్చన్నారు. ఈ టోర్నమెంట్‌లో ప్రతిభ చూపిన వారికి రూ.60వేల విలువైన బహుమతులను అందజేస్తామని చెప్పారు. గ్రీన్‌స్కూల్ ప్రిన్సిపాల్ టి.సుజాత మాట్లాడుతూ తమ పాఠశాల ఆవరణలో నిర్వహించనున్న ఈ టోర్నమెంట్‌లో ప్రతి గ్రూప్‌లోని మొదటి ఐదుగురు విజేతలకు ప్రత్యేకమైన బహుమతులను అందజేస్తామన్నారు. పాఠశాల వైస్ ప్రిన్సిపాల్స్‌ఈ. స్వాతి, కె.చరణ్య వాసవీ, కె.శ్రీదివ్య పాల్గొన్నారు. టోర్నమెంట్‌లో పాల్గొనే వారు ఆదివారం ఉదయం 8.30కు వేదిక దగ్గర రిపోర్ట్ చేయాలని, వివరాలకు 97007 75220లో సంప్రదించాల్సిందిగా కోరారు.
చిలకలపూడి(మచిలీపట్నం): రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా వ్యాప్తంగా రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం నిర్వహించాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు. రాజ్యాంగ దినోత్సవానికి రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో ఘనంగా నిర్వహించి పౌరులు, ముఖ్యంగా యువత చురుకుగా పాల్గొనేలా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, యువజన వ్యవహారాలశాఖ సూచించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, స్థానిక సంస్థల్లో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్యాశాఖాధికారులు అన్ని పాఠశాలు, కళాశాలల్లో ఉదయం 11 గంటలకు రాజ్యాంగ పీఠిక సామూహికపఠనం నిర్వహించి విద్యార్థుల గరిష్ట భాగస్వామ్యాన్ని నిర్ధారించాలన్నారు.
సిటీ తూగుతోంది!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కూటమి పాలనలో ప్రజలు తాగేందుకు స్వచ్ఛమైన మంచినీరు దొరక్కపోయినా, కానీ మద్యం మాత్రం ఎనీటైం దొరుకుతోంది. అర్ధరాత్రి దాటినా, వేకున జామైనా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్యం ఎక్కడైనా దొరుకుతోంది. నగరంలో ఎనీటైమ్ మద్యం(ఏటీఎం) వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి వైన్‌షాపులు, బార్‌లు మూయాల్సి ఉన్నా, మామూళ్ల మత్తులో జోగుతున్న పోలీస్, ఎకై ్సజ్ యంత్రాంగం వాటివైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో అక్రమ మద్యం వ్యాపారం నిరంతరాయంగా కొనసాగుతోంది. నగరంలోని 59 వైన్‌షాపులు, 105 వరకూ బార్‌లు ఉన్నాయి. వాటిలో అధిక శాతం వాటిలో ఇలాంటి విక్రయాలు సాగుతూనే ఉన్నాయి.
ప్రత్యేక కౌంటర్‌లు ఏర్పాటు..
నగరంలోని వైన్‌షాపులు, బార్‌ల వద్ద అక్రమ మద్యం వ్యాపారం కోసం బడ్డీ కొట్టు టైప్‌లో ప్రత్యేక కౌంటర్‌లు ఏర్పాటు చేశారు. దీంతో సమయం ముగిసిన తర్వాత షాపు షట్టర్ మాత్రమే వేస్తారు. కానీ పక్కన ఉన్న కౌంటర్ ద్వారా వ్యాపారం సాగుతూనే ఉంటుంది. అర్ధరాత్రి, వేకువజాము, ఉదయం అనే తేడా లేకుండా ఏ సమయంలోనైనా ప్రత్యేక కౌంటర్‌లలో మద్యం విక్రయాలు సాగుతున్నాయి. అంతేకాదు సమయం ముగిసిన తర్వాత జరిపే విక్రయాలకు అధిక ధరలు వసూళ్లు చేస్తుంటారు. అలా ఒక్కో ప్రాంతంలో ఒకలా ధరలు ఉంటున్నాయి.
అధికారులు షరా‘మామూళ్లే’..
మద్యం షాపుల్లో అర్ధరాత్రి దాటినా అమ్మకాలు సాగిస్తున్నా పోలీస్, ఎకై ్సజ్ అధికారులు తమకేమి తెలియనట్లు మిన్నకుండి పోతున్నారు. అందుకు నెలనెలా వారికి అందుతున్న మామూళ్లే కారణం అంటున్నారు. వ్యాపారాన్ని బట్టి నగరంలోని వైన్‌షాపుల నుంచి ప్రతి నెలా రూ.50వేల నుంచి రూ.70వేల వరకూ ముడుపులు అందుతున్నట్లు సమాచారం. వాటిలో ప్రజా ప్రతినిధులకు వాటా వెళ్తున్నట్లు చెబుతున్నారు. దీంతో రేట్లు పెంచి అమ్ముతున్నా, అర్ధరాత్రి దాటిన తర్వాత విక్రయాలు జరిపినా తమకేమి పట్టనట్లు మిన్నకుండి పోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అర్ధరాత్రి దాటినా మద్యం విక్రయాలు జరుపుతుండటంతో ఆ సమయంలో మద్యం తాగిన యువత వల్ల నిత్యం వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇటీవల లబ్బీపేట వాటర్ ట్యాంక్ రోడ్డులో అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ గోల్డ్ షాపులో పనిచేసే యువకులు, ఆ ప్రాంతంలో స్థానికంగా ఉండే వారి మధ్య మద్యం మత్తులో వివాదం జరిగింది.
రాణీగారితోట బాలాజీ నగర్‌లో ఉదయం 6 గంటలకే మద్యం విక్రయాలు జరుపుతుండటంతో ఇటీవల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరగడుపునే మద్యం తాగుతున్నారని, అందుకు వైన్‌షాపుల్లో విక్రయాలే కారణమంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాదు చిట్టినగర్, సింగ్‌నగర్ ప్రాంతాల్లో సమయం ముగిసిన తర్వాత మద్యం తాగి, ఆ మత్తులో వివాదం చోటుచేసుకుని ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడిన ఘటనలు కూడా ఇటీవల చోటుచేసుకున్నాయి.
అర్ధరాత్రి దాటినా
ఆగని మద్యం అమ్మకాలు
నిత్యం వేకువజాము నుంచే
అమ్మకాలు ప్రారంభం
మామూళ్ల మత్తులో ఎకై ్సజ్,
పోలీసు శాఖలు
ప్రతినెలా ఒక్కో వైన్ షాపు నుంచి
రూ. 70వేల వరకూ వసూళ్లు
వాటిలో ప్రజాప్రతినిధులకు వాటాలు