నున్న(విజయవాడరూరల్): నున్నలోని వికాస్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కృష్ణా విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల మహిళల వాలీబాల్ చాంపియన్షిప్ పోటీల్లో విజయ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, నున్న జట్టు విజేతగా నిలిచింది. శ్రీదుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల జట్టు ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. ఈ పోటీల్లో విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) జట్టు తృతీయ స్థానాన్ని దక్కించుకుంది. నున్నలోని వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రాంగణంలో నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో ఈ పోటీలను నిర్వహించారు. వికాస్ విద్యాసంస్థల చైర్మన్ ఎన్.నర్సిరెడ్డి వాలీబాల్ పోటీలను ప్రారంభించగా.. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి మొత్తం ఏడు కళాశాలల జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి వికాస్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ డాక్టర్ డి.సురేష్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వికాస్ విద్యాసంస్థల చైర్మన్ ఎన్. నర్సిరెడ్డి విజేతలకు ట్రోఫీలు, పతకాలను అందజేశారు. కృష్ణా వర్సిటీ మహిళల వాలీబాల్ సెలక్షన్ కమిటీ సభ్యులు కె.కోటేశ్వరరావు, డాక్టర్ ఎన్.హేమ, వికాస్ బీపీఎడ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ జి.రఘునాఽథ్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ అలీ పాల్గొన్నారు.


