గుర్తుతెలియని వృద్ధుడి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వృద్ధుడి మృతి

Nov 26 2026 1:41 AM | Updated on Nov 26 2026 1:41 AM

గుర్తుతెలియని వృద్ధుడి మృతి ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన గుర్తు తెలియని వృద్ధుడు విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించాడు. ఈ ఘటనపై బుధవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. మూలపాడు గ్రామంలో భిక్షాటన చేసుకునే 60 ఏళ్ల గుర్తుతెలియని వృద్ధుడు ఈ నెల 15వ తేదీన 65వ నంబర్‌ జాతీయ రహదారి దాటుతున్న క్రమంలో కారు ఢీకొంది. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న వృద్ధుడు పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మృతుడి పేరు ఎం.అప్పన్నగా పోలీసులు గుర్తించారు. అతను ఏ ప్రాంతం నుంచి వచ్చాడు, కుటుంబ సభ్యులు ఎవరు అనే వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడిని గుర్తించిన వారు 94406 27084 సెల్‌ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సీఐ సుబ్రహ్మణ్యం కోరారు. గోసాల శివారులో యువకుడి హత్య క్రెడిట్‌ కార్డు రద్దు పేరుతో మోసం

పెనమలూరు: మండలంలోని కంకిపాడు లాకుల వద్ద ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు.. కంకిపాడుకు చెందిన పెమ్మాడి మహేష్‌ (26) సమోసాల దుకాణంలో పనిచేస్తాడు. అతనిపై కంకిపాడు పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్‌ షీటు ఉంది. కంకిపాడుకు చెందిన రమేష్‌, గోసాలకు చెందిన సాయి, మహేష్‌ స్నేహితులు. వారు ముగ్గురూ కలిసి బుధవారం మద్యం తాగారు. మద్యం మత్తులో మహేష్‌, రమేష్‌ గొడవపడ్డారు. సాయి వారిని నివా రించే యత్నం చేశాడు. దీంతో మహేష్‌ తన వద్ద ఉన్న కత్తితో సాయిపై దాడికి యత్నించాడు. సాయి అక్కడే ఉన్న దుంగతో మహేష్‌ దవడపై బలంగా కొట్టాడు. దీంతో మహేష్‌ ముఖం, దవడ పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం రమేష్‌, సాయి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తల్లి నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం ఈ కేసు పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్‌ఐ తాతాచారి తెలిపారు.

సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్‌): క్రెడిట్‌ కార్డు క్లోజ్‌ చేసే పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఓ వృద్ధుడిని నమ్మించి అతని బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.1,29,857 దోచుకున్నారు. ఈ ఘటనపై సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. 60 ఏళ్ల చీమకుర్తి త్రివిక్రమరావు కుటుంబ సభ్యులతో కలసి నగరంలోని దుర్గాపురం, పసుపులేటివారి వీధిలో నివసిస్తున్నారు. గత నెల 31న తివిక్రమరావుకు ఆకాష్‌ అనే వ్యక్తి వాట్సాప్‌ ద్వారా ఫోన్‌ చేసి తాను ఎస్‌బీఐ బ్యాంక్‌ టెక్నికల్‌ విభాగానికి చెందిన అధికారిగా పరిచయం చేసుకున్నాడు. క్రెడిట్‌ క్లోజ్‌ చేసే పక్రియలో భాగం వచ్చే ఓటీపీ చెప్పాలని త్రివిక్రమరావును నమ్మించాడు. అతను ఓటీపీ చెప్పిన వెంటనే అతని బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.500 మరో ఖాతాకు బదిలీ అయినట్లు ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. వెంటనే ఫోన్‌ చేసి అడగ్గా ఆ డబ్బులు తిరిగి ఖాతాలో జమ అవుతాయని ఆకాష్‌ సూచించాడు. అనంతరం నవంబర్‌ ఒకటో తేదీన మరోసారి ఫోన్‌ చేసి క్రెడిట్‌ కార్డు ఇంకా రద్దవలేదని మళ్లీ ఓటీపీలు చెప్పాలని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన త్రివిక్రమరావు మరోసారి ఓటీపీలు చెప్పారు. అనంతరం ఆరు విడతల్లో రూ.1,29,857 మేర నగదు అతని ఖాతా నుంచి వేరే ఖాతాలకు జమవడాన్ని గుర్తించి ఎస్‌ఎన్‌పురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement