భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు(ఈవీఎం), వీవీప్యాట్ గోడౌన్‌కు పటిష్ట భద్రత కల్పించామని, అయినప్పటికీ నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మిశ అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీలో భాగంగా ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి బుధవారం గొల్లపూడి పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోగల ఈవీఎం, వీవీప్యాట్‌ల గోడౌన్‌ను పరిశీలించారు. సీసీ కెమెరాల పని తీరుతోపాటు అగ్నిమాపక, విద్యుత పరికరాలను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరుస్తున్న గోడౌన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందిస్తున్నామని తెలిపారు. డీఆర్‌ఓ ఎం. లక్ష్మీనరసింహం, యరడ్ల ఆంజనేయరెడ్డి(వైఎస్సార్ సీపీ), యేదుపాటి రామయ్య(టీడీపీ), మురళీకృష్ణ (ఐఎన్‌సీ) తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ


