గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సమాజంలో జరుగుతున్న హింసను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని డీసీపీ కేజీవీ సరిత పిలుపునిచ్చారు. బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో దళిత సీ్త్ర శక్తి ఆధ్వర్యంలో సీ్త్రలపై హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారోద్యంలో భాగంగా సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న డీసీపీ సరిత మాట్లాడుతూ సామాజిక స్పృహతో ప్రతి ఒక్కరూ మెలగాలన్నారు. రాప్తాడు తరహా ఘటనలు జరిగినపుడు చలించిపోయానన్నారు. కొత్త విధానాలను రూపొందించి సమాజంలో మార్పు కోసం, హింస లేని సమాజం కోసం కృషి చేస్తున్నామన్నారు. దళిత సీ్త్ర శక్తి జాతీయ కన్వీనర్ ఝాన్సీ గెడ్డం మాట్లాడుతూ దళిత సీ్త్ర శక్తి ఆధ్వర్యంలో సీ్త్రలపై హింసకు వ్యతిరేకంగా ప్రతియేటా అంతర్జాతీయ ప్రచారోద్యమం జరుగుతుందన్నారు. ఏటా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు 16 రోజులపాటు జరిగే ఈ ప్రచారోద్యమంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం నిర్వహించిన ర్యాలీని డీసీపీ కేజీవీ సరిత జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో దళిత సీ్త్ర శక్తి కో ఆర్డినేటర్లు సత్య, ప్రసన్న, సౌజన్య, అఖిల, ప్రవీణ్, ప్రసాద్, సైకాలజిస్టులు పాల్గొన్నారు.
దళిత సీ్త్ర శక్తి సభలో డీసీపీ కేజీవీ సరిత


