మెరుగైన సేవలే కెనరా బ్యాంక్‌ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మెరుగైన సేవలే కెనరా బ్యాంక్‌ లక్ష్యం

Nov 20 2026 2:30 AM | Updated on Nov 20 2026 2:30 AM

మెరుగైన సేవలే కెనరా బ్యాంక్‌ లక్ష్యం

పటమట(విజయవాడతూర్పు): డిజిటల్‌ బ్యాంకింగ్‌ రంగంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, వినియోగదారులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలను అందించ డంలో కెనరా బ్యాంక్‌ ముందంజలో ఉందని కెనరా బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ ఆర్‌.దేవరాజ్‌ పేర్కొన్నారు. కెనరా బ్యాంక్‌ వ్యవస్థాపకుడు అంబెమ్మల్‌ సుబ్బారావు జయంతి, బ్యాంక్‌ 121వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం బ్యాంక్‌ సాధించిన ప్రగతిని ఆయన గుర్తుచేశారు. 1906లో ప్రారంభమైన కెనరా బ్యాంక్‌ రూ.30 లక్షల కోట్లకు పైగా వ్యాపారంతో దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటిగా ఎదిగిందన్నారు. వ్యవస్థాపకుల దూరదృష్టి, వినియోగదారుల విశ్వాసం, ఉద్యోగుల అంకితభావంతో బ్యాంక్‌ నిరంతరం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. బ్యాంక్‌ వ్యవస్థాపకుల ఆశయాలకు అనుగుణంగా వినియో గదారులు, భాగస్వాములు, ఉద్యోగులు, వాటాదారుల అభివద్ధికి కెనరా బ్యాంక్‌ కట్టుబడి ఉందని తెలిపారు. సంప్రదాయ బ్యాంకింగ్‌ విలువలను కొనసాగిస్తూనే, డిజిటల్‌ సాంకేతికతతో నూతన ప్రస్థానాన్ని నిర్మించడమే బ్యాంక్‌ లక్ష్యమని జనరల్‌ మేనేజర్‌ ఆర్‌.దేవరాజ్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement