రాష్ట్రస్థాయి పోటీల్లో షూటర్లకు పతకాలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల్లో షూటర్లకు పతకాలు

Nov 20 2026 2:30 AM | Updated on Nov 20 2026 2:30 AM

రాష్ట్రస్థాయి పోటీల్లో షూటర్లకు పతకాలు

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు నెల్లూరులో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన షూటింగ్‌ పోటిల్లో తమ అకాడమీ క్రీడాకారులు పతకాలు పొందారని ది ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ షూటింగ్‌ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ నాగిశెట్టి సుబ్రహ్మణేశ్వరరావు తెలిపారు. స్థానిక అకాడమీ ఆధ్వర్యంలో పతకాలు పొందిన క్రీడాకారులను గురువారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్‌–14, అండర్‌–17 బాలబాలికల రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ షూటింగ్‌ పోటీల్లో శెట్టి సాయిదేవ వర్షిణి, పారా అశ్రీత్‌ చౌదరి బంగారు పతకాలు, వెజ్జు ధారియా, పులివర్తి కార్తికేయ, ఆయాన్‌ అలీ బేగ్‌, తమిడెడ్ల సేతు మాధవ్‌ రజతం, తమాన్యూ సిరంగి, మెంగు మోక్షిత్‌ కాంస్య పత కాలు పొందారని వివరించారు. ఈ నెల 24 నుంచి గోవాలో జరిగే అండర్‌–17, వచ్చే ఏడాది జనవరి 18 నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగే అండర్‌–14 జాతీయస్థాయి పోటీలకు ఈ క్రీడాకారులు అర్హత సాధించారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement