లారీ ఢీకొని యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

Nov 20 2026 2:30 AM | Updated on Nov 20 2026 2:30 AM

కంకిపాడు: టిఫిన్‌ కోసం వెళ్తూ లారీ ఢీకొని ఓ యువకుడు మృత్యు ఒడికి చేరుకున్నాడు. ఈ ఘటన కంకిపాడు–గన్నవరం రోడ్డులో ఉప్పలూరు సెంటరులో గురువారం జరిగింది. ఎస్‌ఐ కె.వై.దాసు కథనం మేరకు.. మండలంలోని ఈడుపుగల్లు గ్రామానికి చెందిన కొప్పుల వెంకట మధుబాబు (30) ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్నాడు. గురు వారం ఉదయం కూలీలకు టిఫిన్‌ తీసుకునేందుకు బైక్‌పై ఉప్పలూరు వెళ్లాడు. ఉప్పలూరు సెంటరులో వేల్పూరు రోడ్డు వద్దకు వచ్చే సరికి కంకిపాడు నుంచి గన్నవరం వైపు వెళ్లే లారీ వేగంగా బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకట మధుబాబు రోడ్డపై పడగా లారీ వెనుక చక్రాలు అతని మీదుగా వెళ్లటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, లారీ డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దాసు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement