సమగ్ర యాజమాన్యంతో అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

సమగ్ర యాజమాన్యంతో అధిక దిగుబడులు

Nov 20 2026 2:30 AM | Updated on Nov 20 2026 2:30 AM

సమగ్ర యాజమాన్యంతో అధిక దిగుబడులు సెక్యూరిటీగార్డు నిజాయతీ ‘నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కు అన్యాయం జరగకుండా చూడాలి’ సెంట్రల్‌ సమాచార కేంద్రంలో సేవకుడి బ్యాగ్‌ మాయం అభయాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ.13.58 లక్షలు

కంకిపాడు: సమగ్ర యాజమాన్య చర్యలతో అధిక దిగుబడులు సాధ్యమని జిల్లా వనరుల కేంద్రం ఇన్‌చార్జి కె.శ్రీనివాసరావు సూచించారు. కంకిపాడులో మండల వ్యవసాయాధి కారి వెలివెల ఉషారాణి ఆధ్వర్యంలో వరి, మినుము, మొక్కజొన్న, ఇతర పంటల్లో యాజ మాన్య పద్ధతులపై గురువారం శిక్షణ కార్య క్రమం నిర్వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రైతులు పంటల్లో అధిక దిగుబడులు సాధించేందుకు సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటుగా భూసారాన్ని పరిరక్షించుకునే చర్యలు చేపట్టాలన్నారు. నేల పరీక్షలు ఆధారంగానే యాజమాన్య చర్యలు తీసుకోవాలన్నారు. చీడపీడలను తొలి దశలోనే గుర్తించి వ్యవసాయ శాఖ చేసిన సూచనలకు అనుగుణంగా ఎరువులు, పురుగు మందులను వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌సీ ఏఓ పద్మజ, కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్‌ రేవతి, డాక్టర్‌ పద్మావతి, విస్తరణాధికారి భవాని, వీఏఏలు ఎం.యామిని, ఎం.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో దొరికిన బ్యాగ్‌ను భద్రంగా భక్తురాలికి అప్పగించిన సెక్యూరిటీ గార్డును అందరూ అభినందించారు. హైదరాబాద్‌కు చెందిన సీతామహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు గురువారం రాత్రి ఆలయా నికి చేరుకున్నారు. దర్శనం అనంతరం రాజ గోపురం ఎదుట కూర్చుని తిరిగి వెళ్లే క్రమంలో బ్యాగ్‌ను మర్చిపోయారు. బ్యాగ్‌ను గమనించిన ఆలయ సెక్యూరిటీ గార్డు విజయలక్ష్మి వెంటనే ఆ బ్యాగ్‌ను ఆలయ అధికారులకు అప్పగించారు. ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది సమక్షంలో బ్యాగ్‌ తెరిచి చూడగా అందులో నగలు కనిపించాయి. దీంతో వెంటనే దేవస్థానం మైక్‌ ద్వారా ప్రచారం చేయడంతో సదరు భక్తురాలు ఆలయానికి తిరిగి చేరుకున్నారు. ఆలయ చైర్మన్‌ రాధాకృష్ణ సమక్షంలో సుమారు రూ.20 లక్షల విలువ చేసే బంగారు నగలను తిరిగి భక్తురాలికి అప్పగించారు.

మధురానగర్‌ (విజయవాడ సెంట్రల్‌): రాష్ట్ర పతి ఉత్తర్వులు – 2025 నేపథ్యంలో చేపట్టనున్న క్యాడర్‌ పునర్వ్యవస్థీకరణలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూడా లని ప్రభుత్వాన్ని ఏపీ గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీ నాన్‌ టీచింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర కార్యదర్శి మురళీ గౌడ్‌ ఆధ్వర్యంలో కమిషనర్‌ ఆఫ్‌ కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయంలో గురువారం జాయింట్‌ డైరెక్టర్‌ చప్పిడి కృష్ణకు వినతిపత్రమిచ్చారు. అందులో ఉద్యోగోన్నతులు, సీనియారిటీ, సర్వీస్‌ హక్కుల పరిరక్షణ, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల క్యాడర్‌ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ప్రతిపాదనలను పేర్కొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీ కానుకల లెక్కింపులో సేవ చేసేందుకు విచ్చేసిన ఓ భక్తుడి బ్యాగ్‌ చోరీకి గురైంది. బుధవారం ఉదయం రాయల బసవేశ్వరరావు తన బ్యాగ్‌ను దేవస్థానం లగేజీ కౌంటర్‌లో భద్రపరిచారు. బ్యాగ్‌లో తన ఆధార్‌ కార్డు, సెల్‌ఫోను, డ్రైవింగ్‌ లైసెన్సు, కారు ఆర్‌సీ బుక్‌, కొంత నగదు, జర్నలిస్టు అక్రెడిటేషన్‌ కార్డును ఉదయం ఆరు గంటలకు భద్రపరిచారు. హుండీ కానుకల లెక్కింపు ముగియ డంతో బ్యాగ్‌ కోసం కౌంటర్‌ వద్దకు వెళ్లితే బ్యాగ్‌ కనిపించలేదు. కౌంటర్‌లోని సిబ్బందిని ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వకపోగా, సీసీ కెమెరాల రూమ్‌కు వెళ్లి చూసుకోవాలని తల బిరుసుగా చెప్పారు. వెంటనే సీసీ కెమెరాల రూమ్‌కు వెళ్లి పుటేజీని పరిశీలిస్తే 6.30 గంటల సమయంలో బ్యాగ్‌ను వేరే వ్యక్తి తీసుకువెళ్లడం కనిపించింది. దీనిపై వన్‌టౌన్‌ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు.

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: హనుమాన్‌జంక్షన్‌లోని ప్రసిద్ధ అభయాంజనేయస్వామి దేవస్థానంలో హుండీ కానుకల ద్వారా రూ.13.58 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి పితాని తారకేశ్వరరావు, ఆలయ పాలకమండలి చైర్మన్‌ వేమూరి శ్రీనివాసరావు తెలిపారు. దేవస్థానం కార్యాలయం ప్రాంగణంలో దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో స్వామివారి హుండీ కానుకలను గురువారం లెక్కించారు. 97 రోజులకుగానూ రూ.13,58,959 వచ్చినట్లు వివరించారు. దేవదాయ ఇన్‌స్పెక్టర్‌ వి.సురేష్‌కుమార్‌, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement