మచిలీపట్నంఅర్బన్: కృష్ణా వర్సిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సుల బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో ప్రత్యేక ఆహ్వానితులుగా బందరు జీజీహెచ్‌కు చెందిన జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి డాక్టర్ జి. భానుమూర్తి, సూపరింటెండెంట్ డాక్టర్ జి. పద్మశ్రీ నియమితులయ్యారు. ఈ మేరకు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె. రాంజీ సోమవారం ఉత్తర్వులిచ్చారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమలు కానున్న హాస్పిటల్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా, యూజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు సంబంధించిన పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో వీరు భాగస్వాములు కానున్నారు.
డాక్టర్ భానుమూర్తి
డాక్టర్ పద్మశ్రీ


