యండపల్లిలో కూలిపోయిన రేకులషెడ్డును లేవదీసుకుంటున్న బాధితులు
కృత్తివెన్నులో దారికి అడ్డంగా పడిన చెట్టును తొలగిస్తున్న స్థానికులు
అర్నబ్ తుపాను తీర ప్రాంతమైన కృత్తివెన్ను మండలంపై తీరని ప్రభావం చూపింది. ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో విరుచుకుపడిన పెనుగాలుల కారణంగా చెట్లు, ఇళ్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. వీటి మరమ్మతులకు చాలా సమయం పట్టేటట్టు కనిపిస్తోంది. చేతికంది వచ్చిన వరి పంట పూర్తిగా నేలమట్టం కావడంతో పాటు, చినగొల్లపాలెం దీవిలో వారి జీవనాధారమైన కొబ్బరి, సపోట, సరుగుడు తోటలు చిందరవందరై పోయాయని వారు వాపోతున్నారు. విద్యుత్ లేకపోవడంతో గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. ప్రభుత్వం తాత్సారం చేయకుండా వెంటనే స్పందించి రైతులకు, ప్రజలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. – కృత్తివెన్ను


