ఆదరించండి.. అభివృద్ధి చేస్తాం | - | Sakshi
Sakshi News home page

ఆదరించండి.. అభివృద్ధి చేస్తాం

Oct 26 2026 8:00 AM | Updated on Oct 26 2026 8:00 AM

ఆదరించండి.. అభివృద్ధి చేస్తాం ● మచిలీపట్నం నగరపాలక సంస్థలో మేయర్‌ అభ్యర్థి లంకా జ్యోతి ఆదివారం కావటంతో నగరంలోని పలు చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. తెలుగు బాప్టిస్టు చర్చి, హోసన్నా మందిరం, నోబుల్‌ చర్చిల్లో ప్రార్థనల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ షేక్‌ సలార్‌దాదా, మాజీ డెప్యూటీ మేయర్‌ లంకా సూరిబాబు, వైఎస్సార్‌ సీపీ నాయకులు బందెల థామస్‌ నోబుల్‌, రాసంశెట్టి వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. ● పెడన మునిసిపాలిటీలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉప్పాల రాము 8వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి దొడ్డి పట్ల శివపార్వతితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 14, 15 వార్డుల్లో జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ ఉప్పాల హారిక చైర్మన్‌ అభ్యర్థి కటకం నాగకుమారి, కౌన్సిలర్‌ అభ్యర్థి మెట్ల లక్ష్మీసాయి తేజ, జల్లూరి శరత్‌బాబులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ● ఉయ్యూరు మునిసిపాలిటీ పరిధిలో ఆదివారం ఉదయం ఏజీఅండ్‌ఎస్‌జీ కళాశాలలో ఉదయపు నడక మిత్రులతో ప్రచారం నిర్వహించారు. చైర్మన్‌ అభ్యర్థి పైడిముక్కల దివ్య, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దేవభక్తుని చక్రవర్తి మార్నింగ్‌ వాకర్స్‌తో కొద్దిసేపు ముచ్చటించి ఉయ్యూరు మునిసిపాలిటీ పరిధిలో గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ఉయ్యూరు పట్టణంలో ఉన్న సమస్యలను తెలుసుకొని రాబోయే రోజుల్లో వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం 27వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కౌన్సిలర్‌ అభ్యర్థి కరీం బేగ్‌ పలువురు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చిలకలపూడి(మచిలీపట్నం): మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి మచిలీపట్నం నగరపాలక సంస్థ, పెడన, ఉయ్యూరు మునిసిపాలిటీల్లో మేయర్‌, చైర్మన్‌ అభ్యర్థుల ప్రచారాన్ని ఆదివారం కొనసాగించారు. మచిలీపట్నం నగరపాలక సంస్థలో మేయర్‌ అభ్యర్థి లంకా జ్యోతి పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో తమను ఆదరిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని, ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. నగరంలోని పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించటంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. ఉయ్యూరు, పెడన మునిసిపాలిటీల్లో కూడా అభ్యర్థుల ప్రచారం విస్తృతంగా సాగింది.

ప్రార్థనా మందిరాల్లో మేయర్‌, చైర్‌ పర్సన్‌ అభ్యర్థుల ప్రచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement