మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అర్ణబ్ తుపాను ప్రభావం వల్ల విద్యుత్ సరఫరాలో ఏ విధమైన అంతరాయం కలుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి అధికారులకు చెప్పారు. గుణదలలోని ఏపీ సీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం ఆదివారం జరిగింది. తుపాను కారణంగా బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని పరిస్థితి గురించి సమావేశంలో చర్చించారు. భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు దెబ్బతినే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
సమాచారం ఇవ్వండి..
విద్యుత్ ప్రమాదాలు లేదా సరఫరా అంతరాయాలకు సంబంధించిన సమాచారం అందించేందుకు ప్రతి సర్కిల్ పరిధిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని పుల్లారెడ్డి చెప్పారు.
● ఎన్టీఆర్ జిల్లాలో.. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ పరిధిలోని వారు 94408 17561, నూజివీడు డివిజన్ 73826 23234, గుణదల డివిజన్ 94910 52947లోనూ, అలాగే కృష్ణాజిల్లా సమాచారాన్ని 62817 09355కు తెలియ జేయాల్సిందిగా కోరారు.


