జిల్లాకు పొంచి ఉన్న ‘అర్ణబ్‌’ ముప్పు | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు పొంచి ఉన్న ‘అర్ణబ్‌’ ముప్పు

Oct 26 2026 8:00 AM | Updated on Oct 26 2026 8:00 AM

ఉద్ధృతంగా గాలులు వీచే అవకాశం 24 గంటలూ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్‌

చిలకలపూడి(మచిలీపట్నం): అర్ణబ్‌ తుపాను ముంచుకొస్తోందని, జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా అన్ని శాఖల అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ ఆదేశించారు. జిల్లా, మండల, గ్రామస్థాయిల్లోని అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండి తుపాను పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఆదివారం రాత్రి జిల్లా అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, రెవెన్యూ డివిజనల్‌ అధికారులు తదితరులతో కలెక్టర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, ముందుగానే రిలీఫ్‌ కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు. రిలీఫ్‌ కేంద్రాలకు చేరుకునే ప్రజలకు తాగునీరు, భోజనం, మరుగుదొడ్లు తదితర కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అవసరమైన నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు.

టెలికాం సేవలకు

అంతరాయం కలగకూడదు..

టెలికాం ఆపరేటర్లు సెల్‌ టవర్ల నిర్వహణకు అవసరమైన డీజిల్‌ జనరేటర్లు, ఇంధనం, బ్యాకప్‌ విద్యుత్‌ సదుపాయాలను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ సూచించారు. రోడ్లపై చెట్లు కూలిపోవడం, ఇతర అడ్డంకులు ఏర్పడిన సందర్భాల్లో వెంటనే తొలగించేందుకు అవసరమైన యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. బీసీ సంక్షేమ, ఎస్సీ సంక్షేమ శాఖల పరిధిలోని వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. పరిస్థితులను బట్టి విద్యార్థులను వారి తల్లిదండ్రుల వద్దకు లేదా సురక్షిత ప్రాంతాలకు పంపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సమాచారాన్ని ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement