కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Sep 7 2026 7:45 AM | Updated on Sep 7 2026 7:45 AM

సోమవారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 నేడు పీజీఆర్‌ఎస్‌ అన్నదానానికి విరాళాలు –8లోu దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ

న్యూస్‌రీల్‌

సర్కార్‌ సంచులు మూడు నెలలకే చిరిగాయి నాసిరకంగా విద్యార్థి మిత్ర కిట్లు ఇచ్చిందే అంతంత మాత్రం జిల్లా వ్యాప్తంగా అన్ని బడుల్లో ఇదే పరిస్థితి

పులిచింతల సమాచారం

సోమవారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

7

చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని పేర్కొన్నారు.

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ నిత్యాన్నదాన పథకానికి పలువురు భక్తులు ఆదివారం విరాళాలు సమర్పించారు. వారికి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.

రద్దీ నేపథ్యంలో

అంతరాలయ దర్శనం రద్దు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శ్రావణ మాసం నేపథ్యంలో తెల్లవారుజామున అమ్మవారికి ఖడ్గమాలార్చనను రెండు షిఫ్టులలో నిర్వహించారు. ఉదయం లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమంలో సైతం ఉభయదాతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరో వైపున అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు ఉదయం 11.40 గంటలకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. అరగంట తర్వాత తిరిగి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో రద్దీ మరింత అధికం కావడంతో మహా నివేదన అనంతరం అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. రూ.500 టికెట్ల విక్రయాలను నిలిపివేసి, రూ.300 టికెట్‌పై బంగారు వాకిలి దర్శనం కల్పించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తిరిగి రూ. 500 టికెట్ల విక్రయాలు ప్రారంభించారు. దీంతో వీఐపీలు, సిఫార్సులపై విచ్చేసిన వారికి సైతం అంతరాలయ దర్శనం కల్పించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): సర్కార్‌ బడుల్లో చిన్నారుల భుజాలపై పుస్తకాల బరువుతోపాటు.. చిరిగిన బ్యాగుల భారం పడుతోంది. కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిన ‘విద్యార్థి మిత్ర’ కిట్లలోని బ్యాగులు కొద్ది రోజులకే చిరిగిపోతుండటంతో విద్యార్థులు అవస్థ పడుతున్నారు. పుస్తకాలు కింద పడిపోకుండా చేతులతో పట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోందని వారు చెబుతున్నారు.

నాడు నాణ్యతతో కూడిన కిట్లు

రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకూ అధికారంలో ఉన్న వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో సర్కార్‌ బడుల్లో చిన్నారులకు అన్ని రకాలుగా అండగా ఉండే లక్ష్యంతో జగనన్న విద్యా కానుక పేరుతో కిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ క్రమంలో పుస్తకాలు, వర్క్‌బుక్‌, యూనిఫామ్‌, బూట్లు, బెల్టు, సాక్సులు ఇలా నాణ్యమైన పలు వస్తువులతో కూడిన బ్యాగ్‌ను విద్యార్థులకు అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థులకు అందించే జగనన్న విద్యాకానుక కిట్ల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని విద్యార్థులు వాపోతున్నారు. పేరును సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్టుగా పేరు మార్చి నాణ్యత లేని వస్తువులను ఇస్తున్నారని మండిపడుతున్నారు.

అంతంత మాత్రంగా పంపిణీ

ఎన్టీఆర్‌ జిల్లాలో 20 మండలాలు కొనసాగుతున్నాయి. అందులో సుమారుగా 920 ప్రభుత్వ విద్యాసంస్థల్లో 88,432 మంది విద్యార్థులు ఉన్నట్లుగా ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వారందరికీ విద్యార్థి మిత్ర కిట్లను అందజేయాల్సి ఉంది. 2025–2026 విద్యా సంవత్సరంలో ఉన్న సంఖ్యలో పదో తరగతి విద్యార్థులను తీసివేసి ఇండెంట్‌ను అధికారులు పంపించారు. కొత్తగా చేరిన వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన కిట్లు రాకపోవడం, పాఠశాలలు మానివేసిన పాత విద్యార్థుల కిట్లను కొత్తవారికి అందించారు. పాఠశాలలు తెరిచి మూడు మాసాలైనా ఇంకా చాలా మందికి పూర్తి స్థాయి వస్తువులతో కూడిన కిట్లు అందలేదని విద్యార్థులు వివరిస్తున్నారు. బ్యాగులు, బూట్లు ఇప్పటికీ చాలా మందికి పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులే చెబుతున్నారు.

నాసిరకంతో అవస్థలు

విద్యార్థులకు అందిన బ్యాగులు ఇతర వస్తువులు నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బ్యాగులు విద్యార్థులకు అందించిన నెల రోజుల్లోనే అవి చిరిగిపోవడం ప్రారంభమైంది. పుస్తకాలతో బడికి వెళ్తున్న విద్యార్థులు వాటిని తీసుకెళ్లడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. బూట్ల విషయంలోనూ అదే నాణ్యత వెంటాడుతోందని విద్యార్థులు వాపోతున్నారు. ఇటీవల సీపీఎం నేతల బృందం ఎ.కొండూరు మండలంలోని ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో సమావేశమైనప్పుడు వారి స్కూల్‌ బ్యాగులు చూసి అవాక్కయ్యారు. చిరిగిన బ్యాగులతో విద్యార్థులు అవస్థలు పడటంపై వారు నాణ్యతపై ప్రశ్నించారు. జిల్లాలోని అనేక ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు చిరిగిన బ్యాగులతో కుస్తీ పడుతున్నారు.

మండిపడుతున్న తల్లిదండ్రులు

చిన్నారుల అవస్థలను చూసి తల్లిదండ్రులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించే కిట్లు గతంలో చక్కగా ఉండటమే కాకుండా మా పిల్లలు ఇబ్బందులు లేకుండా బడులకు వెళ్లే వారని ఇప్పుడు పుస్తకాలు బ్యాగ్‌లో నుంచి ఎక్కడ పడిపోతాయోనని బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం అందించే బ్యాగులు, బూట్లు నాణ్యమైనవి ఇస్తే బాగుం టుంది. పిల్లలను ఎందుకు కష్టాలపాలు చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 27.8716 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజిల ద్వారా వెళుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement