పెనమలూరు: బందరు కాలువలో దూకి గల్లంతైన వ్యక్తి కోసం ఎస్డీఆర్‌ఎఫ్ బృందం గాలింపు చేపట్టింది. పెనమలూరు ఎస్‌ఐ తాతాచారి తెలిపిన వివరాల ప్రకారం పెనమలూరు శ్రీహరిగార్డెన్స్‌లో పమిడిముక్కల గణేష్‌కుమార్(36) తల్లిదండ్రులతో ఉంటున్నాడు. అతను గతంలో చేపల చెరువులు చేసి ఆర్థికంగా నష్టపోయాడు. అతనికి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. అతను మాససికంగా బాధపడుతూ మనస్తాపానికి గురయ్యాడు. తాను చనిపోతానని పోరంకిలో ఉంటున్న సోదరి పద్మావతికి తరచూ ఫోన్ మెసేజ్ పెడుతున్నాడు. తండ్రికి శనివారం ఫోన్‌చేసి ఇంటికి వస్తున్నానని చెప్పి అతను పెనమలూరు వంతెనపై నుంచి బందరు కాలువలో దూకి గల్లంతయ్యాడు. పోలీసులు అతని కోసం బందరు కాలువలో గాలింపు చేపట్టగా ఆచూకీ తెలియలేదు. దీంతో ఎస్డీఆర్‌ఎఫ్ బృందాన్ని పోలీసులు రంగంలోకి దింరు. వారు బందరు కాలువలో గణేష్‌కుమార్ కోసం విస్తతంగా గాలిస్తున్నారు.


