మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరుగుతున్న 52వ జానియర్ జాతీయ అక్వాటిక్స్ చాంపియన్ షిప్–2026లో ఆదివారం జరిగిన పోటిల్లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎం.యజ్ఞసాయి ప్రతిభ చూపి సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. బాలురు గ్రూప్–1బి(అండర్–16) 800 మీటర్ల ఫ్రీస్టైల్‌ను 8:41.46 సెకన్లలో పూర్తి చేసి సిల్వర్ మెడల్‌ను పొందాడు. ఈ చాంపియన్‌షిప్‌లో యజ్ఞసాయి ప్రతిభ చూపి మొత్తం ఐదు పతకాలు (మూడు రజత, రెండు కాంస్య పతకాల)ను సొంతం చేసుకున్నాడు. ప్రతిభ చూపిన యజ్ఞసాయిని ఏపీ అమెచ్యూర్ అక్వాటిక్స్ అసోసియేషన్ చైర్మన్ కె.రవికాంత్, అధ్యక్షుడు ఎం.ఓబుల్‌రెడ్డి, కార్యదర్శి మోహన్‌వెంకట్‌రామ్‌తో పాటు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల స్విమ్మింగ్ అసోసియేషన్ సభ్యులు, స్విమ్మర్లు అభినందనలు తెలిపారు. ఆదివారం సాయంత్రం పోటీలు ముగిశాయి.


