పటమట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో జరిగిన అవతకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్ సీపీ తలపెట్టిన నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఆదివారం వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, విజయవాడ తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌కు పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ పరిధిలోని మాచవరం పోలీసులు నోటీసులు ఇచ్చారు. నారా లోకేష్ రాజీనామా కోరుతూ వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు నిర్వహించే ర్యాలీకి అనుమతి లేదంటూ నోటీసులు అందించారు. విజయవాడలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని, అనుమతి లేకుండా నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


