గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తరహాలో బీసీలకు రక్షణ చట్టం చేసి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీనగర్‌లోని ఆలపాటి ఫంక్షన్ హాల్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు మాట్లాడుతూ సమాజంలో బీసీలపై వివక్ష, దాడులు జరుగుతున్నాయన్నారు. వీటన్నిటికీ పరిష్కారం బీసీల రక్షణ చట్టం ఒక్కటేనన్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ బీసీ రక్షణ చట్టం వజ్రాయుధం లాంటిది అన్నారు. భట్రాజు సంఘం అధ్యక్షుడు కోటంరాజు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి బడిగించల చంద్రమౌళి, డాక్టర్ అలా వేంకటేశ్వరావు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు చెల్లా అనుదీప్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యలమందరావు, విశాఖ జిల్లా అధ్యక్షుడు నమ్మి అప్పలరాజు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు రామారావు, రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు నక్క శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
జాతీయబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్


