ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వాన్ని సహించం ‘మీ కోసం’లో జాయింట్ కలెక్టర్ నవీన్ ప్రజల నుంచి 156 అర్జీలు స్వీకరణ
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక(మీ కోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీతో పాటు ఇన్‌చార్జ్ డీఆర్వో పోతురాజు, మెప్మా పీడీ సాయిబాబు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ నీలకంఠేశ్వరరెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఫోన్లు మాట్లాడితే ఎలా?
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీలు తీసుకునే సమయంలో ఆ సమస్యను బట్టి సంబంధిత అధికారిని పిలిచి మాట్లాడుతామని అన్నారు. అటువంటి సమయంలో అధికారులు బాధ్యతారాహిత్యంగా ఫోన్లు మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. మీకోసంలో వచ్చిన అర్జీల పరిష్కారంలో జాప్యం చేస్తే సహించేది లేదన్నారు. ప్రతిశాఖ అధికారి వారానికోసారి సమీక్ష నిర్వహించి పెండింగ్ అర్జీలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శని, ఆదివారాల్లో సంబంధిత అధికారులు పీజీఆర్‌ఎస్ పోర్టల్‌లో ఉన్న దరఖాస్తులను తప్పనిసరిగా పరిశీలించి వెంటనే పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. పంచాయతీరాజ్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ, సర్వే శాఖల్లో పెండింగ్ కేసులు ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో అధికారులు 156 అర్జీలను స్వీకరించారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..


