దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు

Jul 7 2026 1:49 AM | Updated on Jul 7 2026 1:49 AM

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.39కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 16 రోజులకు ఆలయంలోని హుండీల ద్వారా మొత్తం రూ.3,39,53,599 నగదు, 568 గ్రాముల బంగారం, 3.330 కిలోల వెండి వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. విదేశీ కరెన్సీ కూడా భారీగానే ఉంది. 576 యూఎస్‌ఏ డాలర్లు, 100 ఆస్ట్రేలియా డాలర్లు, 22 మలేషియా రింగిట్స్‌, 295 యూఏఈ దిర్హమ్స్‌, 1500 నైజిరియా నైరీలు, 800 కంబోడియా రియల్స్‌, 30 వేల టాంజేనియా షిలాంగ్స్‌, 850 కోరియన్‌ వాన్లు, 500 పాకిస్తాన్‌ రూపీలతో పాటు చైనా, థాయ్‌లాండ్‌, హాంగ్‌కాంగ్‌కు చెందిన నగదు కానులుగా లభించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న రూ.2 వేల నోట్లు ఐదు, రద్దు చేసిన రూ.1,000 నోట్లు తొమ్మిది, రూ.500 నోట్లు 74 ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. కానుకల లెక్కింపు ఏసీ రంగారావు, ఏఈఓ ఎన్‌.రమేష్‌బాబు, సూపరింటెండెంట్లు, ఆలయ ట్రస్ట్‌ బోర్డు సభ్యుల పర్యవేక్షణలో సాగింది. కానుకల లెక్కింపులో ఆలయ సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement