15 నుంచి అమరావతి చాంపియన్‌షిప్‌ | - | Sakshi
Sakshi News home page

15 నుంచి అమరావతి చాంపియన్‌షిప్‌

Jul 7 2026 1:49 AM | Updated on Jul 7 2026 1:49 AM

15 నుంచి అమరావతి చాంపియన్‌షిప్‌

మచిలీపట్నంఅర్బన్‌: హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 29న నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ నెల 15 నుంచి ఆగస్టు 26వ తేదీ వరకు అమరావతి చాంపియన్‌షిప్‌–2026 పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం. నవీన్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనునున్నట్లు తెలిపారు. అండర్‌–17, అండర్‌–23 విభాగాలకు చెందిన వారు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి పొతురాజు, మెప్మా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సాయిబాబా, కేఆర్‌సీసీ డెప్యూటీ కలెక్టర్‌ నీలకంఠేశ్వర రెడ్డి, మచిలీపట్నం డీఎస్పీ శ్రీనివాస్‌, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి కె. ఝాన్సీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement