అన్ని కేంద్రాలకు పంపిణీ చేస్తాం..
జగ్గయ్యపేట: ఎల్‌పీజీ గ్యాస్ సమస్యలను అధిగమించటానికి, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఇండెక్షన్ స్టవ్‌లు అంగన్‌వాడీ కేంద్రాలకు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహిళా శిశు సంక్షేమ శాఖ, ఇంధన సమర్థ సేవల సంస్థ (ఈఈఎస్‌ఎల్) సంయుక్తంగా ఇండెక్షన్ స్టవ్‌లు, అందుకు సంబంధించిన వంట పాత్రలను ఇందన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సామగ్రి అందిస్తున్నారు. కానీ జిల్లాలో ఇండెక్షన్ స్టవ్‌లు, వంట పాత్రలు అందించడంలో జాప్యం జరుగుతుంది.
జిల్లాలో 1,475 కేంద్రాలు..
జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, విజయవాడ రూరల్ పరిధిలో 1,475 అంగనవాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో సుమారు 20 వేల మంది చిన్నారులున్నారు. ఈ కేంద్రాలకు విడతల వారీగా నెల రోజుల క్రితం ఇండెక్షన్ స్టవ్‌లు వాటికి సంబంధించిన వంట పాత్రల కిట్‌లను అన్ని కేంద్రాలకు పంపిణీ చేసింది.
అయితే కొన్ని ప్రాజెక్టు కార్యాలయాలకు స్టవ్‌లు పూర్తి స్థాయిలో వస్తే వంట పాత్రలు మాత్రం అరకొరగానే ప్రభుత్వం పంపిణీ చేసింది. జగ్గయ్యపేటలోని చిల్లకల్లు ప్రాజెక్టులో 267 కేంద్రాలకు 37 స్టవ్‌లు పంపిణీ చేయగా నందిగామలో వంట పాత్రలు రాగా స్టవ్‌లు మాత్రం రాలేదు. తిరువూరు, మైలవరం, విజయవాడ రూరల్ ప్రాంతాలకు స్టవ్‌లు, వంట పాత్రలు పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది.
గ్యాస్‌కు స్వస్తి..
ఇండెక్షన్ స్టవ్‌లు రానుండటంతో ఇక అంగన్‌వాడీ కేంద్రాలలో గ్యాస్ పొయ్యిలకు స్వస్తి పలకనున్నారు. ఇండెక్షన్ స్టవ్‌ల వల్ల ఎల్‌పీజీ గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో విద్యుత్ పొయ్యిలు వాడటం ద్వారా వంట ఖర్చులు తగ్గుతాయి. అంతే కాకుండా సాంప్రదాయ వంట పొయ్యిలతో పోల్చితే ఇండెక్షన్ స్టవ్‌ల ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. పొగ, మసి లేకుండా పరిశుభ్రమైన వాతావరణంలో వంట చేసేందుకు వీలుంటుంది.
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు అరకొరగా పంపిణీ
జిల్లాలోని అన్ని అంగనవాడీ కేంద్రాలకు ఇండెక్షన్ స్టవ్‌లు, వంట పాత్రలు వస్తున్నాయి. కొన్ని ప్రాజెక్టు కార్యాలయాల్లో పంపిణీ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తాం.
– షేక్ రుక్సానా సుల్తానా, పీడీ


