మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ సెగ జిల్లాను తాకింది. చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో సామాన్య ప్రజల ఆందోళన తారస్థాయికి చేరుకుంది. ఫలితంగా వంట గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరుతున్నారు. ఆన్‌లైన్ సేవలు సైతం నిలిచిపోవడంతో ఏం జరుగుతుందో అన్న భయంతో ఏజెన్సీ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ తక్షణం స్పందించి పరిస్థితి సరిదిద్దాలని పలువురు వినియోగదారులు కోరుతున్నారు. విజయవాడ మిల్క్‌ప్రాజెక్ట్ ప్రాంతంలోని ఓ గ్యాస్ కంపెని వద్ద పరిస్థితిని చిత్రాల్లో చూడొచ్చు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ


