సజావుగా సెకండ్‌ ఇంటర్‌ ఫిజిక్స్‌–2 పరీక్ష | - | Sakshi
Sakshi News home page

సజావుగా సెకండ్‌ ఇంటర్‌ ఫిజిక్స్‌–2 పరీక్ష

Mar 14 2026 8:39 AM | Updated on Mar 14 2026 8:39 AM

సజావుగా సెకండ్‌ ఇంటర్‌ ఫిజిక్స్‌–2 పరీక్ష హెలీప్యాడ్‌ వద్ద సీఎం చంద్రబాబుకు స్వాగతం ఇద్దరు ‘అద్విక’ ఏజెంట్లు అరెస్టు రైతు రుణభారం తగ్గించడానికే.. రోడ్డు ప్రమాదంలో మెడికల్‌ విద్యార్థి మృతి

మచిలీపట్నంఅర్బన్‌: జిల్లాలో శనివారం నిర్వహించిన సెకండ్‌ ఇంటర్మీడియెట్‌ ఫిజిక్స్‌–2 పరీక్ష సజావుగా జరిగినట్లు జిల్లా ఇంటర్మీడియెట్‌ పరీక్షల అధికారి ఎస్‌.సరళకుమారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 62 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించామన్నారు. మొత్తం 20,282 మంది విద్యార్థులు పరీక్షకు నమోదు కాగా, వీరిలో 20,129 మంది హాజరయ్యారయ్యా రని, 153 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్షకు సెట్‌–3 ప్రశ్నపత్రాన్ని వినియోగించా మని, మొత్తం 99 శాతం హాజరు నమోదైనట్లు డీఐఈఓ పేర్కొన్నారు.

గన్నవరం: కొండపావులూరు శివారులోని ఎన్డీఆర్‌ఎఫ్‌ ప్రాంగణంలో సీఎం చంద్రబాబుకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. సూరంపల్లి శివారులో జరగనున్న అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హెలికాఫ్టర్‌లో సాయంత్రం 4.42 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. హెలిప్యాడ్‌ వద్ద సీఎంకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ కమాండెంట్‌ వి.వి.ఎన్‌. ప్రసన్నకుమార్‌, కృష్ణా కలెక్టర్‌ డి.కె.బాలాజీ, ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు తదితరులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం రోడ్డు మార్గంలో సభ వేదిక వద్దకు బయలుదేరారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): అద్విక ట్రేడింగ్‌ కంపెనీలో కొద్ది మొత్తంలో డిపాజిట్‌ చేసి, అధిక మొత్తంలో కంపెనీ నుంచి నగదు బదిలీ చేయించుకున్న ఇద్దరు ఏజెంట్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం రామవరప్పాడుకు చెందిన చిలకలపూడి నాగ దుర్గాకల్యాణ్‌ అద్వికలో ఏజెంట్‌గా ఉన్నారు. సుమారు రూ.5.70 లక్షలు డిపాజిట్‌ చేశారు. ఆ మొత్తానికి వడ్డీ, ఏజెంటు కమిషన్‌ కలిసి రూ. 1.02 కోట్లు కంపెనీ నుంచి పొందారు. అతనితో పాటు, తమ్ముడు చిలకలపూడి వీర వెంకట నాగ రాజేంద్రకుమార్‌తో కలిసి కంపెనీలో వారికి తెలిసిన వారి ద్వారా డిపాజిట్లు పెట్టించి, అద్విక ఐపీ పెట్టేలోపు అధిక లాభాలు పొందారు. వారు రూ.1.53 కోట్లు డిపాజిట్లు చేయగా, రూ 4.77 కోట్లు అక్రమంగా అధికంగా పొందారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

మరొకరు ఇలా..

ప్రకాశం జిల్లా చింతల గ్రామానికి చెందిన పాటిబండ్ల సుధాకర్‌ ఏజెంట్‌గా ఉండి అద్విక నుంచి అక్రమంగా అధిక మొత్తం పొందినందుకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు 18 మంది నుంచి రూ.2.87 కోట్లు డిపాజిట్‌ చేయించారు. వారికి రిటర్న్‌గా రూ.1.67 కోట్లు చెల్లించారు. నిందితుడు రూ.8.35 లక్షలు డిపాజిట్‌ చేయగా, ఏజెంట్‌ కమిషన్‌ డిపాజిట్‌తో కలిసి రూ.3.22 కోట్లు అక్రమంగా పొందాడు. ఇతనికి కంపెనీ నుంచి రూ.2.76 కోట్లు అధికంగా వచ్చాయి. ఇలా అతని చెల్లెలు బొల్లినేని సుజాతతో డిపాజిట్‌ చేయించి అధిక మొత్తంలో పొందడంతో అతనిపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్టు చేశారు.

మైలవరం: రైతుల రుణభారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ –పీఎం కిసాన్‌ పథకం ద్వారా ప్రతి రైతుకు రూ.6వేలు రైతు ఖాతాలో జమచేస్తుందని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. మైలవరం మండలం వెల్వడం గ్రామం రైతు సేవా కేంద్రంలో అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్‌ మూడవ విడత నిధులు విడుదల కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌, కలెక్టర్‌ లక్ష్మీశ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారి డీఎంఎఫ్‌ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.

పటమట(విజయవాడతూర్పు): రోడ్డు ప్రమాదంలో ఓ మెడికల్‌ విద్యార్థి మృతి చెందిన ఘటన పటమట పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురానికి చెందిన చెర్రి లిఖిత్‌సాయి నగరంలోని సిద్ధార్థ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. కళాశాల సమీపంలోని కరెన్సీనగర్‌లో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. గురువారం రాత్రి రూమ్‌ నుంచి ద్విచక్ర వాహనంపై లబ్బీపేటలోని ఫుడ్‌కోర్టుకు వెళ్లి వస్తున్నారు. ప్రభుత్వాస్పత్రి ఎదురుగా ఉన్న ఆస్పత్రి వద్ద సర్వీస్‌రోడ్డులో ముందు వెళ్తున్న వారిని.. ఎదురుగా వస్తున్న కారును.. తప్పించిపోయి అదుపుతప్పి పడిపోయాడు. స్థానికులు లిఖిత్‌సాయి స్నేహితుడు గరగ అరుణ్‌ఆదిత్యకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న లిఖిత్‌ స్నేహితుడు సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన లిఖిత్‌ మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతుని స్నేహితుడు అరుణ్‌ ఆదిత్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement