ఉప్పొంగిన ఆవిర్భావోత్సాహం | - | Sakshi
Sakshi News home page

ఉప్పొంగిన ఆవిర్భావోత్సాహం

Mar 13 2026 9:00 AM | Updated on Mar 13 2026 9:00 AM

ఉప్పొంగిన ఆవిర్భావోత్సాహం ● పామర్రు నియోజకవర్గంలో మాజీ శాసన సభ్యుడు కై లే అనిల్‌కుమార్‌ సారథ్యంలో పార్టీ కార్యాలయంలో జెండాను ఎగురవేశారు. అనంతరం వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు కె.స్వరూపరాణి, రాజులపాటి పార్వతి, జొన్నల రామ్మోహన్‌రెడ్డి, ఎంపీపీలు దాసరి అశోక్‌కుమార్‌, గోగం సురేష్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నామా వెంకటేశ్వరరావు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ● అవనిగడ్డ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్‌బాబు నేతృత్వంలో పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసి అనంతరం కేక్‌ కట్‌ చేశారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా అవనిగడ్డ వంతెన సెంటరు వరకు వచ్చి రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానికులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు కర్నాటి రాంబాబు, యువ నాయకుడు సింహాద్రి వికాస్‌, జెడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కళ్యాణి, పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి దాసరి జయగోపాల్‌, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ● మచిలీపట్నం నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో మేయర్‌ చిటికిన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ, డెప్యూటీ మేయర్‌ మాడపాటి విజయలక్ష్మి, నగర పార్టీ అధ్యక్షుడు మేకల సుబ్బన్న, వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు బూరగడ్డ రమేష్‌నాయుడు, కాగిత బున్ని, గూడ వల్లి నాగరాజు, షేక్‌ మొహమ్మద్‌ సాహెబ్‌, మట్టా నాంచారయ్య, గణేశన రమేష్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ● పెడన నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉప్పాల రాము నేతృత్వంలో పార్టీ జెండా ఎగురవేసి దివంగత నేత వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి మహా విగ్రహంతో పాటు పట్టణంలోని పలు కూడళ్లలో ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎండీ ఖాజా, పార్టీ నాయకులు కటకం ప్రసాద్‌, జెడ్పీటీసీ సభ్యులు వేముల సురేష్‌, మైలా రత్నకుమారి, ఎంపీపీ చినబాబు, పార్టీ నాయకులు గొరిపర్తి రవికుమార్‌, వంగవీటి నాగబాబు, గరికిపాటి రామానాయుడు, జల్లా భూపతి, బండారు మల్లికార్జునరావు పాల్గొన్నారు. ● గుడివాడ పట్టణంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో పార్టీ జెండాను స్థానిక నాయకులు ఆవిష్కరించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. కార్యాలయంలోని వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మట్టా జాన్‌ విక్టర్‌, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, పార్టీ సీనియర్‌ నాయకులు పాలేటి చంటి, అడబాల అప్పారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ● గన్నవరం నియోజకవర్గంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో స్థానిక నాయకులు జెండాను ఎగురవేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామిశెట్టి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ ఎలిజిబెత్‌రాణి, ఎంపీపీ ఆనగాని రవి, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ● పెనమలూరు నియోజకవర్గంలో పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లో వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించారు.

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉత్సాహంగా వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు పార్టీ జెండాలు ఎగురవేసి కేక్‌ కట్‌ చేసిన ఇన్‌చార్జ్‌లు, నాయకులు వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు

చిలకలపూడి(మచిలీపట్నం): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు పూర్తయి 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గురువారం జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో, గ్రామస్థాయిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండాలను ఆవిష్కరించిన అనంతరం దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయాల్లో కేక్‌ కట్‌ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచారు. ఆయా కార్యక్రమాల్లో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో పాటు పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement