మచిలీపట్నంటౌన్: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) గురువారం నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని కావూరి నివాసంలో ఆయన భౌతికకాయాన్ని పేర్ని నాని సందర్శించి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కావూరి అంతిమ యాత్రలో పేర్ని నాని పాల్గొని పాడెను మోశారు. అలాగే మచిలీపట్నం మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్‌దాదా, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు లంకె వెంకటేశ్వరరావు కూడా కావూరి పాడెను మోశారు. కావూరి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో కృష్ణాజిల్లా వ్యవసాయ అభివృద్ధి మండలి మాజీ చైర్మన్ జన్ను రాఘవరావు, వైఎస్సార్ సీపీ నగర నాయకుడు బూరగ రామారావు తదితరులు ఉన్నారు.
సాక్షి నెట్‌వర్క్: కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నగరంలో గురువారం ఓ వింత చోటుచేసుకుంది. సామాన్యంగా ఎకై ్సజ్ బార్ అండ్ రెస్టారెంట్ షాపునకు సంబంధించి లాటరీలో ఎంపిక పద్ధతిలో షాపు కేటాయించిన లైసెన్సుదారుడు బార్ అండ్ రెస్టారెంట్‌ను అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే నగర పరిధిలో ఏర్పాటు చేసిన ఈ బార్ అండ్ రెస్టారెంట్ ఓ కంటైనర్‌లో ఏర్పాటు చేసి నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. తాత్కాలికంగా కంటైనర్‌ను తీసుకువచ్చి దానిలో షాపును ఏర్పాటు చేసి విక్రయాలు ప్రారంభించారు. ఈ విషయంపై ఎకై ్సజ్ ఏఈఎస్ భార్గవ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఫిబ్రవరి 5వ తేదీన నిర్వహించిన లాటరీలో ఈ షాపు కేటాయింపు జరిగిందన్నారు. 15 రోజుల వరకు ప్రొవిజనల్ లైసెన్సు ఇస్తామని, ఆలోగా బార్ అండ్ రెస్టారెంట్‌ను అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేసిన అనంతరం తాము పరిశీలించి పర్మినెంట్ లైసెన్సు ఇస్తామని వివరించారు. ఈ బార్‌కు సంబంధించిన లైసెన్సుదారుడు ప్రొవిజనల్ లైసెన్సును పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకుంటే తాము కాలపరిమితి పెంచామని ప్రస్తుతం ఈ బార్ అండ్ రెస్టారెంట్ ప్రొవిజనల్ కాలపరిమితిలోనే ఉందన్నారు. అయితే బార్ అండ్ రెస్టారెంట్ ఈ విధంగా ఏర్పాటు చేయకూడదని అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు.
నిబంధనలకు నీళ్లు..
బార్ అండ్ రెస్టారెంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేసిన ఎకై ్సజ్ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాల్సి ఉంది. లైసెన్సు ఇచ్చి నెలరోజులు దాటినప్పటికీ ఇంత వరకు ఈ బార్ అండ్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయకపోవటం, ప్రొవిజనల్ లైసెన్సు కాలపరిమితి పెంచటం చూస్తుంటే అధికార పార్టీ నాయకుల హస్తం ఉందని తెలుస్తోంది. బార్ అండ్ రెస్టారెంట్‌ను తాము ఏ విధంగానైనా నిర్వహిస్తామని నిబంధనలు వర్తించవచ్చన్న రీతిలో ఈ బార్ అండ్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసిన తీరే ఇందుకు నిదర్శనం.


