మచిలీపట్నంలో వాజ్‌పేయి విగ్రహం మాయం !
మచిలీపట్నంటౌన్: స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీ రింగ్ సెంటర్‌లో గత నెల 16న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహం మాయమైంది. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని టీడీపీ–బీజేపీ శ్రేణులు అట్టహాసంగా నిర్వహించాయి. అనంతరం అదే సర్కిల్‌లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే విగ్రహం ప్రతిష్ట జరిగిన 15 రోజుల్లోనే వాజ్‌పేయి విగ్రహం మాయంకావడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.
అప్పుడే మెరుగులు దిద్దాలా ?
స్థానికుల కథనం ప్రకారం అజ్ఞాత వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం బహిర్గతమైతే పరువు పోతుందనే ఉద్దేశంతో విగ్రహాన్ని తొలగించినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి భిన్నంగా పార్టీ వర్గాలు మాత్రం ‘మెరుగులు దిద్దేందుకు’ తాత్కాలికంగా విగ్రహాన్ని కిందకు దించామని వివరణ ఇస్తున్నాయి. అయితే విగ్రహ ప్రతిష్ట జరిగిన కొద్ది రోజులకే మెరుగులు దిద్దాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిణామాలపై కొందరు బీజేపీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అసలు ఘటనపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. నిజంగా విగ్రహం డ్యామేజ్ అయిందా? లేక ఆ విషయం బయటకు రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నమా? అన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతోంది.
గత నెల 16న విగ్రహ ప్రతిష్ఠ


