అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశం హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీ ఎం.నవీన్, డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, డీఎస్పీ శ్రీనివాసరావు అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టిసారించి పరిష్కరించాలన్నారు. కొత్త ఏడాదికి పూలబొకేలు, స్వీట్లు కాకుండా కృష్ణసంకల్పం పేరుతో విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు అందించాలన్నారు. డిసెంబరు 31న పింఛన్ల పంపిణీ చేపట్టాలన్నారు. మీకోసం కార్యక్రమంలో అధికారులు 152 అర్జీలను స్వీకరించారు.
అర్జీల్లో కొన్ని


