బరి తెగింపు!
సంక్రాంతికి ముందే జోరుగా కోడి పందేలు, పేకాట
ఉమ్మడి కృష్ణా జిల్లాలో బరులు సిద్ధం
నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు భారీగా ముడుపులు!
రూ.30 లక్షల నుంచి రూ. 2 కోట్లు పలుకుతున్న వైనం
పట్టించుకోని పోలీసులు
సంప్రదాయం ముసుగులో..
240 కోడి కత్తులు పట్టివేత
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో పందెంరాయుళ్లు కాలు దువ్వుతున్నారు. సంక్రాంతికి ముందే కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో పలుచోట్ల మామిడితోటల్లో కోడిపందేలు, పేకాట శిబిరాలు జరుగుతున్నాయి. నియోజకవర్గ, పార్లమెంటు ప్రజాప్రతినిధులు పచ్చ జెండా ఊపడంతో నిర్వాహకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. పోలీసులకు సైతం మామూళ్లు అందుతుండటంతో వారు వీటిపై కన్నెత్తి చూడటం లేదని తెలుస్తోంది.
‘క్యాసినో’ నిపుణులు రంగంలోకి..
ఈ ఏడాది ప్రత్యేకంగా ఇప్పటికే క్యాసినో నిపుణులను నిర్వాహకులు రంగంలోకి దించుతున్నారు. నార్త్, గోవా, నేపాల్ డీలర్లతో సంప్రదింపులు జరిపినట్లు జోరుగా చర్చ సాగుతోంది. రాత్రీపగలు క్యాసినోకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో..
సంక్రాంతి వేళ సంప్రదాయం ముసుగులో కోట్లు దండుకునేందుకు అధికార టీడీపీ రెడీ అయ్యింది. పండుగ వేళ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బరుల స్థాయిని బట్టి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు రూ.30 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు రేటు ఫిక్స్ చేశారు. వీటి నిర్వహణను పెద్ద ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలకు కొందరు ప్రజాప్రతినిధులు అప్పజెప్పారు. పండుగకు వారం ముందు నుంచే ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహిస్తూ సంప్రదాయం ముసుగు కప్పి బరులను సిద్ధం చేసేందుకు ప్రణాళిక రెడీ చేశారు.
గుడ్లవల్లేరు: మండల కేంద్రంలో భారీగా కోడి కత్తులను పోలీసులు పట్టుకున్నారు. దీనిపై ఎస్.ఐ సత్యనారాయణ మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారంతో గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ వద్ద కోడి కత్తులు కలిగి ఉన్నట్లు తెలిసి సిబ్బందితో కలిసి కుంభా రామకృష్ణ అనే దివ్యాంగుడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. 240 కోడి కత్తులు స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. అతనిపై గుడ్లవల్లేరు పీఎస్‌లో కేసు నమోదు చేశామన్నారు.
బరి తెగింపు!
బరి తెగింపు!
బరి తెగింపు!


