గుడ్లవల్లేరు ఫార్మసీలో జాతీయ సదస్సు | - | Sakshi
Sakshi News home page

గుడ్లవల్లేరు ఫార్మసీలో జాతీయ సదస్సు

Dec 30 2025 8:46 AM | Updated on Dec 30 2025 8:46 AM

గుడ్లవల్లేరు ఫార్మసీలో జాతీయ సదస్సు

గుడ్లవల్లేరు ఫార్మసీలో జాతీయ సదస్సు

గుడ్లవల్లేరు ఫార్మసీలో జాతీయ సదస్సు

గుడ్లవల్లేరు: లిపిడోమిక్స్‌ వినూత్న పరిశోధనలు అంశంపై వి.వి.ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ గుడ్లవల్లేరులోని ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌ విభాగం ఆధ్వర్యంలో సోమవారం జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా మిచిగన్‌ వేన్‌ స్టేట్‌ యూనివర్సిటీ రీసెర్చ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ పి.గోవిందయ్య హాజరయ్యారు. సాంకేతికత ద్వారా ఫ్యాటీ యాసిడ్‌ ప్రొఫైలింగ్‌లో జరుగుతున్న వినూత్న పరిశోధనలు అనే అంశంపై విలువైన ఉపన్యాసం అందించారు. లిపిడోమిక్స్‌ రంగంలో ఈ ఆధునిక విశ్లేషణ పద్ధతుల ప్రాముఖ్యతను, ఔషధ పరిశోధన, ఆరోగ్య శాస్త్రాల్లో వాటి వినియోగాన్ని వివరించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ. లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. డాక్టర్‌ గోవిందయ్యను ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆయన చేసిన పరిశోధనా సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమం కో–ఆర్డినేటర్‌ డి.లావణ్యతో పాటు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement