హక్కులపై అవగాహన అవసరం
భవానీపురం(విజయవాడపశ్చిమ): వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కల్పించుకోవాలని, డిజిటల్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వైస్ చైర్మన్, ఎండీ ఎస్.ఢిల్లీరావు సూచించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం’ అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిఽథిగా హాజరై ప్రసంగించారు. పౌరసరఫరాల సంస్థ సంచాలకుడు ఆర్.గోవిందరావు మాట్లాడుతూ.. పాఠశాలల్లో కన్జ్యూమర్ క్లబ్‌ల ద్వారా విద్యార్థులకు వినియోగదారుల హక్కు లపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ ప్రేమ్ సజాని పట్నాలా, లీగల్ మెట్రాలజీ శాఖ జాయింట్ కంట్రోలర్ కృష్ణచైతన్య, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, సివిల్ సప్లయీస్ అదనపు సంచాలకులు కె.రంగకుమారి, డీఈఓ చంద్రకళ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పాపారావు, ఏఎస్‌ఓ వేంపాటి శ్రీనివాసులు, విద్యార్థులు, ఎన్‌జీఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించే పోస్టర్‌ను ఆవిష్కరించారు.


