ఆతిథ్యానికి దాడుల సెగ
ఆతిథ్యానికి దాడుల సెగ వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఆతిథ్య రగానికి చెందిన హోటళ్లపై వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వ ర్యంలో ఇటీవల దాడులు జరిగాయి. చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆ శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు నిర్వహించారు. జీఎస్టీ అధికారులు ఒక్కసారిగా మెరుపు దాడులు చేపట్టడంతో విజయవాడ, పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్ల యాజమానులు బెంబేలెత్తారు. ఒకే సారి అన్ని కౌంటర్లపైనా దాడులు నిర్వహించి సమాచారం సేకరించడంతో యాజమానులు అవాక్కయ్యారు.
ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించి విజయవాడ డివిజన్–1, 2, 3 డివిజన్లు కొనసాగుతున్నాయి. ఈ మూడు డివిజన్లకు సంబంధించిన సర్కిల్ కార్యాలయాలు విజయవాడలోనే ఉన్నాయి. నగరంలో ఇటీవల బాగా పేరు వినిపిస్తున్న సుమారు 30 హోటళ్ల వివరాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సేకరించారు. వాటి నుంచి తమకు వస్తున్న జీఎస్టీ ఎంతనేది అంచనా వేసుకొని, ఆ వివరాలను రాష్ట్ర కార్యాలయానికి నివేదించారు. 150 మంది వివిధ కేడర్లకు చెందిన అధికారులతో 25 బృందాలను ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు దాడులు చేయా లని ఆదేశించారు. 25 బృందాలకు హోటళ్లను కేటాయించారు. 30 హోటళ్లపై దాడులు చేయాలని నిర్ణయించినా, అంతర్గత ఇబ్బందులతో కొన్ని తాత్కాలికంగా మూతపడ్డాయి.దీంతో వాటిని మినహాయించారు. ఈ నెల 20వ తేదీ ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగాయి.
జీఎస్టీ అధికారులు ఆయా హోటళ్లపై దాడి చేసిన సమయంలో కౌంటర్‌లో ఉన్న సిస్టమ్‌లోని వివరాలు లేదా బ్యాంకు ఖాతాలు తదితర అంశాలను సేకరించారు. కొద్దిసేపు అక్కడే ఉండి ఖాతాదారుల చెల్లింపులను గమనించారు. ఆయా హోటళ్ల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నులు తీరును పరిశీలించి, మిగిలిన మొత్తం చెల్లించాలని నోటీసులు ఇవ్వనున్నారు. ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇచ్చారు. వాటికి సరైన సమాధానం చెప్పలేకపోతే అందులో పేర్కొన్న మిగిలిన పన్ను, జరిమానా, వడ్డీని విధిస్తామని అధికారులు చెబుతున్నారు. కొన్ని హోటళ్లలో డిజిటల్ చెల్లింపులు లేకపోవటంతో అధికారులు విస్తుపోయినట్లు తెలిసింది.
చంద్రబాబు ప్రభుత్వం సంపద సృష్టిస్తామంటూ ఎన్నికల్లో పదేపదే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వ్యాపారాలు పూర్తిగా దిగజారిపోయాయి. ప్రభుత్వ విధానాలు వివిధ రంగాలను పూర్తిగా కుంగదీశాయి. దీంతో పన్నుల రాబడి భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలోనే హోటళ్లపై దాడులు జరిగాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో మిగిలిన రంగాలపైనా దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉన్నతాధికారుల
ఆదేశాలతోనే దాడులు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజయవాడలోని హోటళ్లపై దాడులు నిర్వహించాం. అక్కడ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు వారికి నోటీసులు జారీ చేస్తాం. చాలా మంది పన్నులు చెల్లిస్తున్నారు. అయితే వాస్తవరీతిలో ఆ పన్నుల చెల్లింపులు ఉన్నాయా లేదా అనేది పరిశీలిస్తాం. వ్యత్యాసాలు ఉంటే ఆయా హోటళ్ల యజమానులకు నోటీసులు ఇస్తాం. సరైన సమాధానం ఇస్తే ఎటువంటి జరిమా నాలు ఉండవు.
మా హోటల్‌పైకి వచ్చే ధైర్యం ఉందా?
విజయవాడ నగరంలోని వివిధ హోటల్స్‌పై దాడులు చేసిన వాణిజ్య పన్నుల శాఖ అధికా రులకు కొన్ని చోట్ల చేదు అనుభవం ఎదురైందని సమాచారం. ఒకరిద్దరు హోటళ్ల యజమానులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయ టంతో పాటుగా ‘మా హోటల్‌పై దాడులు చేసే ధైర్యం ఉందా?’ అంటూ ఎదురు తిరిగినట్లు తెలిసింది. దాడుల నేపఽథ్యంలో పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వాణిజ్య పన్నుల శాఖ అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం.
సీఎంను ఆశ్రయించిన హోటల్స్ అసోసియేషన్ నేతలు
తమపై దాడులు నిలుపుదల చేయాలంటూ నగరానికి చెందిన హోటల్స్ అసోసియేషన్ నేతలు ముఖ్యమంత్రికి తమ గోడు వెళ్లబుచ్చినట్లు తెలిసింది. విజయవాడలో ఈ నెల 22న జరిగిన సెమీ క్రిస్‌మస్ వేడుకలకు చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హోటల్స్ అధినేతలు, అసోసియేషన్ నాయకులు తమ ప్రభుత్వం తమపై దాడులు చేయటం ఏమిటంటూ తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి వద్దకు వెళ్లి ప్రశ్నించినట్లు తెలిసింది. పట్టాభి వారిని వెంటబెట్టుకొని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి దాడుల విషయాన్ని వివరించారని హోటల్ వ్యాపారులు చెబుతున్నారు.
25 హోటళ్లపై 150 మంది
జీఎస్టీ అధికారుల దాడులు
హోటల్స్ ఆదాయాలను పరిశీలిస్తున్న వైనం
సంపద సృష్టిలో భాగంగా హోటల్స్‌పై దాడులు?
– షేక్ జహీర్, డెప్యూటీ కమిషనర్,
విజయవాడ–2 డివిజన్
విజయవాడలో హోటళ్లపై జీఎస్టీ అధికారుల దాడులు
25 హోటళ్లపై దాడులు నిర్వహించిన
150 మంది అధికారులు
సంపద సృష్టిలో భాగంగానే
ఈ దాడులని విమర్శలు
దాడులపై ముఖ్యమంత్రిని
ఆశ్రయించిన హోటళ్ల సంఘ నేతలు