సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య మునిసిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ – 2025 పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విజయవాడలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. శాప్ చైర్మన్ ఎ.రవి నాయుడు మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా క్రీడా పాలసీని అమలు చేస్తోందన్నారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. శాప్ ఎండీ ఎస్.భరణి, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసి డెంట్ ఎం.ద్వారకానాథ్, కార్యదర్శి అంకమ్మచౌదరి మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయన్నారు. శాప్ డైరెక్టర్ సంతోష్, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఐ.రఘురాజ్, జాయింట్ సెక్రటరీ వంశీ తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం
సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం


