కరాటే కుటుంబం
కరాటే శిక్షణపై దృష్టి
కరాటే నా ఊపిరి
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
శుభకరం.. ప్రభు జననం
● దుర్గారావు కుటుంబంలో
మూడు తరాలు కరాటేలోనే..
● జాతీయ, అంతర్జాతీయ
స్థాయిలో పతకాల సాధన
బాల ఏసు ప్రతిమ వద్ద ప్రార్థనలు చేస్తున్న బిషప్ తెలగతోటి రాజారావు
విద్యుత్ దీపాల వెలుగుల్లో విజయవాడ వన్‌టౌన్‌లోని సెయింట్ పౌల్స్ సెంటినరీ చర్చి
ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ సందడి నెలకొంది. చర్చిలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రంగు రంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో ప్రార్థనా మందిరాలు సరికొత్తగా కాంతులీనాయి. క్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలిపేలా ఏర్పాటు చేసిన పశువుల పాక సెట్లు ఆకట్టుకున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. క్రీస్తు విశ్వాసులు వేలాదిగా ప్రార్థనల్లో పాల్గొన్నారు.
పెనమలూరు: పెనమలూరు మండలం యనమలకుదురుకు చెందిన సుంకు దుర్గారావుది నిరుపేద కుటుంబం. ఆటో నగర్‌లో సీట్లు కుట్టడమే వృత్తి. అయితే కరాటేపై మక్కువ ఆయన జీవితాన్నే మార్చే సింది. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడిగా తీర్చిదిద్దింది. ఆయన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి సత్తాచాటారు. తన భార్య, పిల్లలను సైతం కరాటేలో నిపుణులుగా తీర్చిదిద్దారు. దుర్గారావు మనవళ్లు, మనవరాళ్లు సైతం కరాటేలా పతకాల పంట పండిస్తున్నారు.
దుర్గారావు ప్రస్తుత వయసు 64 ఏళ్లు. ఆయన విజయవాడ సింగ్‌నగర్‌లో జన్మించారు. తండ్రి సత్యం, తల్లి లక్ష్మి సింగ్‌నగర్‌లో హోటల్ నడిపేవారు. కుటుంబం గడవక పోవటంతో దుర్గారావు యనమలకుదురులో స్థిరపడి ఆటోనగర్‌లో సీట్లు కుట్టి కుటుంబాన్ని పోషించేవారు. దుర్గారావుకు భార్య నాగమణి, కుమారులు నరేంద్రబాబు, క్రాంతికుమార్, ప్రశాంత్‌కుమార్ ఉన్నారు. 1980లో బ్రూస్‌లీ ప్రభంజనం కాలంలో దుర్గారావుకు కరాటే, కుంగ్‌ఫూ నేర్చుకోవాలన్న కోరిక కలిగింది. మాస్టర్ ఆర్.వి.టి.మణి వద్ద శిక్షణ పొంది 1986లో కరాటే మాస్టర్‌గా ఎదిగారు. 1994లో విజయవాడలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రాణించి మలేషియన్ గ్రాండ్ మాస్టర్ చూచూ షూట్ నుంచి బ్లాక్‌బెల్ట్ పొందారు. దుర్గారావు ప్రేరణతో ఆయన భార్య, ముగ్గురు కుమారులు కూడా కరాటే నేర్చుకున్నారు. వారు సైతం జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. స్థానికంగా ఉంటున్న క్రీడాకారులు, చిన్నారులు, పెద్దలను ప్రోత్సహించి దుర్గారావు కరాటే శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. ఇలా నాలుగు దశాబ్దాలుగా ఎంతో మందికి కరాటేలో శిక్షణ ఇస్తున్నారు దుర్గారావు కుటుంబ సభ్యులు.
కరాటే మాస్టర్ దుర్గారావు ఇంటి నిండా పతకాలే కనబడుతాయి. సీనియర్ సిటిజన్ విభాగంలో 14 బంగారు పతకాలు గెలిచారు. సీనియర్ సిటిజన్ విభాగంలో గ్రాండ్ చాంపియన్‌షిప్‌ను నాలుగు సార్లు కైవసం చేసుకున్నారు. అంతకు ముందు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 18 పతకాలు సాధించారు. ఆయన సాధించిన మొత్తం పతకాల సంఖ్య 32. అతని కుటుంబంలో అందరు కలిపి ఇప్పటికి 175కు పైగా పతకాలు గెలిచారు. కరాటేలో దుర్గారావు, ఆయన భార్య, కుమారులే కాకుండా మనవళ్లు మనవరాళ్లు కూడా కరాటేలో ప్రావీణ్యం సంపాదించారు. తొమ్మిదేళ్ల సాత్విక్, ఏడేళ్ల రుత్విక్, అనన్య, అన్‌షిక్ కరాటే పోటీల్లో సత్తాచాటుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 27 పతకాలు గెలిచారు.
తాను నేర్చుకున్న విద్య తనతో ఆగిపోకుండా ఉండటానికి కరాటేపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని దుర్గారావు చేపట్టారు. వాన్‌కాన్ కరాటే డు ఫెడరేషన్ ఇంటర్నేషనల్ కోచ్‌గా తన వద్ద 30 మంది క్రీడాకారులకు కరాటే, కుంగ్‌ఫూలో కఠిన శిక్షణ ఇస్తున్నారు. విజయవాడ నగరంలో వివిధ పాఠశాలల్లో చదువుతున్ను వెయ్యి మందికిపై విద్యార్థులకు దుర్గారావు కరాటేలో రోజూ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
కరాటే నా ఊపిరి. నా కుటుంబంలో మూడు తరాల వారు కరాటే పోటీల్లో పాల్గొంటున్నారు. నేను 40 సంవ త్సరాలుగా కరాటే రంగంలో ఉన్నాను. అనేక మంది విద్యార్థులను కరాటేలో శిక్షణ ఇచ్చి మాస్టర్‌లుగా తీర్చిదిద్దాను. వ్యక్తిగత సంరక్షణకు కరాటే చాలా అవసరం. ప్రభుత్వం ముందుకొచ్చి సాయం అందిస్తే కరాటేను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తా. ఊపిరి ఉన్నంత వరకు కరాటే పోటీల్లో పాల్గొంటాను.
– సుంకు దుర్గారావు, కరాటే మాస్టర్, యనమలకుదురు
కరాటే కుటుంబం
కరాటే కుటుంబం
కరాటే కుటుంబం
కరాటే కుటుంబం


