పుష్‌కాట్లను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నంటౌన్: నగరపాలక సంస్థ నూతనంగా తయారు చేయించిన 76 చెత్త తరలించే తోపుడుబళ్లను బుధవారం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. స్థానిక క్యాటిల్‌డిపో వద్ద జరిగిన కార్యక్రమంలో రూ.19.80 లక్షల వ్యయంతో తయారు చేసిన చెత్త తరలించే తోపుడుబండ్లతో పాటు రూ.9.50 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన 850 ప్లాస్టిక్ బుట్టలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్రలో భాగంగా వచ్చిన నిధులు 29.30 లక్షలతో వీటిని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ , కమిషనర్ సీహెచ్‌వీవీఎస్ బాపిరాజు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, కాంట్రాక్టర్ కన్నా ప్రసాద్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.


