కృష్ణానదిలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల మాక్ డ్రిల్
ఇబ్రహీంపట్నం: ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను రక్షించే విధానాలపై స్థానిక పవ్రిత్ర సమగం వద్ద కృష్ణానదిలో ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించాయి. నీటి ప్రమాదాలు, వరదల సమయంలో బాధితుల ప్రాణాలు రక్షించడం వంటి చర్యలను నదిలో ప్రదర్శించారు. ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ప్రత్యేక వాహనంలో నది వద్దకు చేరుకుని ప్రత్యేక బోట్ల ద్వారా నదిలోకి చేరుకున్నారు. బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం, అక్కడ నుంచి అంబులెన్స్ ద్వారా వైద్యాధికారుల వద్దకు తీసుకువెళ్లి తక్షణ వైద్య సహాయం అందించి ప్రాణాలు రక్షించడం వంటి సంఘటనలు కళ్లకు కట్టినట్లు మాక్ డ్రిల్ ప్రదర్శించారు. నదిలో చిక్కుకుని ఒడ్డుకు చేరుకోలేక మునిగిపోతున్న వారిని ఎయిర్ బెలూన్‌లు అందించి ఒడ్డుకు చేర్చిన విధానం ఆకట్టుకుంది. కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, మండల తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ వెంకటరత్నం, సీఐ చంద్రశేఖర్, పర్యవేక్షించారు.
కృష్ణానదిలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల మాక్ డ్రిల్


