ప్రజలకు సుపరిపాలన అందించాలి
కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): నాణ్యత ప్రమాణాలు విధిగా పాటిస్తూ ప్రజలకు సుపరిపాలన అందించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరు సమస్యలను ఓపికతో వింటారో వారు మంచి పరిపాలన అధికారిగా పేరు తెచ్చుకుంటారని చెప్పారు. సప్త సూత్రాలను విధిగా పాటించాలని చెప్పారు. డీఆర్వో కె.చంద్రశేఖరరావు, డీఎస్‌వో మోహన్‌బాబు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు శివరాంప్రసాద్, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్ననరసింహులు, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేష్, డీటీడబ్ల్యూవో ఫణి దూర్జటి, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం, వయోజన విద్య డీడీ బేగ్, గృహనిర్మాణ పోతురాజు పాల్గొన్నారు.
కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయం
పరిధిలో ఇటీవల నిర్వహించిన బీటెక్ ఐదో సెమిస్టర్ (రెగ్యులర్, సప్లమెంటరీ), ఎల్‌ఎల్‌బీ, ఎంబీఎల్‌బీ నాలుగు, ఐదు సెమిస్టర్, రీవాల్యుయేషన్, ఎల్‌ఎల్‌ఎం రెండో సెమిస్టర్ రీవాల్యూయేషన్, బి.పి.డి, డి.పి.డి రెండో సెమిస్టర్ రీవాల్యూయేషన్ ఫలితాలను ఈ నెల 20వ తేదీన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూన రాంజీ విడుదల చేసినట్లు విశ్వపరీక్షల నియంత్రణ అధికారి పి.వీరబ్రహ్మచారి తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్ ద్వారా పరిశీలించుకోవాలని సూచించారు. పునఃమూల్యాంకనానికి జనవరి ఆరో తేదీలోగా వెబ్‌సైట్‌లో సూచించిన విధంగా రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.


