బస్సులు ఢీకొని పలువురికి గాయాలు
నందిగామ రూరల్:ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ పాఠశాల బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు డ్రైవర్‌లకు గాయాలైన ఘటన మండలంలో చోటు చేసుకుంది. చందర్లపాడు మండలం మునగాలపల్లి గ్రామానికి చెందిన సెయింట్ లూసి పాఠశాల బస్సు విద్యార్థులను ఎక్కించుకుని వస్తుండగా కేతవీరునిపాడు గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పాఠశాల బస్సు డ్రైవర్ ముప్పాళ్లకు చెందిన శ్రీనివాసరావు, ఆర్టీసీ బస్సు డ్రైవర్ హరికృష్ణలకు గాయాలయ్యాయి. బాధితులను హుటాహుటిన నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యార్థులకు కూడా స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనలో పాఠశాల బస్సు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. దీనిపై పోలీస్ కేసు నమోదు కాలేదు.


