గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్టు
పెనమలూరు: గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామని డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసారావు తెలిపారు. పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పోరంకి సాలిపేట వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు అందుకున్న సమాచారం మేరకు ఎస్‌ఐలు ఫిరోజ్, ఉషారాణి, సిబ్బంది దాడి చేసి దెందులూరు గ్రామానికి చెందిన సేపేని వరప్రసాద్(24), పోరంకి సాలిపేటకు చెందిన పసుమర్తి శ్రీసూర్య(21), గడ్డం రాకేష్(19), గంగూరుకు చెందిన ఎండీ.సులేమాన్(19)లను పట్టుకున్నారని తెలిపారు. వారి వద్ద రెండున్నర కేజీల గంజాయి, మూడు సెల్ ఫోన్‌లు, బైక్ స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఈ కేసులో కీలక నిందితుడైన వరప్రసాద్‌పై పలు గంజాయి కేసులు నమోదు అయ్యాయని వివరించారు. సీలేరు, అరకు ప్రాంతాల్లో గంజాయి తరలిస్తుండగా గతంలో పట్టబడి జైలుకు వెళ్లాడని డీఎస్పీ తెలిపారు.
ఇలా చిక్కారు..
ఈ నెల 12వ తేదీన ఒడిశా రాష్ట్రంలోని పుకాలికి వెళ్లి నర్సింగ్ అనే వ్యక్తి వద్ద 6 కేజీల గంజాయి కేజీ రూ. 4 వేల చొప్పున కొన్నాడని డీఎస్పీ తెలిపారు. పెనమలూరు సెంటర్‌లో ఉండే కౌషిక్, శివకుమార్‌లకు మూడున్నర కేజీలు గంజాయి అమ్మాడని తెలిపారు. వీరిద్దరు పరారీలో ఉన్నారన్నారు. వరప్రసాద్ గంజా యిని శ్రీసూర్య, సులేమాన్, గడ్డం రాకేష్‌కు పోరంకి సాలిపేటలో విక్రయిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. కంకిపాడు సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐలు ఫిరోజ్, ఉషారాణి సిబ్బంది పాల్గొన్నారు.
రెండున్నర కేజీల గంజాయి స్వాధీనం


