
బావిలో దూకి మహిళ ఆత్మహత్య
మైలవరం: బావిలో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మైలవరం మండలం వెల్వడం గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ప్రత్తిపాటి రమణ (55), స్వామి భార్యా భర్తలు. వెల్వడం గ్రామంలోని దళితవాడలో నివసిస్తున్నారు. వారికి సంతానం లేదు. కొంతకాలంగా రమణ అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం బావిలో దూకి ఆత్మహత్య చేసు కుంది. ఈ ఘటనపై ఎస్‌ఐ సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బుడమేరు ముంపు బాధితుల ఐక్యవేదిక నాయకుల ఆగ్రహం.
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగర ప్రజల్లో బుడమేరు ముంపు భయాన్ని తొలగించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బుడమేరు ముంపు బాధితుల ఐక్యవేదిక నాయ కులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుడమేరు ముంపు బాధిత ప్రాంతాల్లోని వివిధ కాలనీలు, అపార్ట్‌మెంట్లు, వ్యాపార, వాణిజ్య అసోసియేషన్ ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, స్థానిక ప్రజలతో సింగ్ నగర్ షాదీఖానాలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.వి.ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ సీహెచ్.బాబూరావు, సీనియర్ రైతు నాయకుడు వై.కేశవరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే బుడమేరు ముంపు నివారణ చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు. బుడమేరు ముంపు నివారణ చర్యలపై ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చేందుకు పార్టీలకు అతీతంగా బుడమేరు ముంపు నివారణ బాధితుల ఐక్యవేదిక ఏర్పడిందని ప్రకటించారు. ఆగస్టు 30వ తేదీన సీపీఎం తలపెట్టిన వరద నిరసన, సెప్టెంబర్ ఒకటో తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద వినతిపత్రాలతో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో వరద బాధితులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రముఖ న్యాయవాది అశోక్‌కుమార్, ఈఎస్‌ఐ రిటైర్డ్ డెప్యూటీ డైరెక్టర్ ఏసు, ప్రింటర్స్ అసోసియేషన్ నాయకులు సత్యనారాయణ, షామియానా సంస్థల అసోసియేషన్ ప్రతినిధి ప్రసాద్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. ప్రసాద్, వివిధ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

బావిలో దూకి మహిళ ఆత్మహత్య