
పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పరిశ్రమలకు అవస రమైన కోర్సులను అందించే ఐటీఐ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. పదో తరగతి అనంతరం ఐటీఐ కోర్సులు చేసిన వెంటనే ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండటమే దీనికి కారణం. ఇటీవల పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి అనంతరం చేరాల్సిన కోర్సులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దృష్టి సారిస్తున్నారు. కొంత మంది విద్యార్థులు పాలిసెట్, రెసిడెన్షియల్ కళాశాలల ప్రవేశ పరీక్షలు రాశారు. అధిక శాతం మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ కోర్సుల్లో చేరనున్నారు. ఇంకా కొందరు విద్యార్థులు టెక్నికల్ కోర్సులు ఉన్న పాలిటెక్నిక్, ఐటీఐలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. పదో తరగతి పూర్తి చేయగానే త్వరితగతిన ఉపాధి పొందేందుకు ఐటీఐ కోర్సులు దోహదం చేస్తాయని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో ఐటీఐ కాలేజీలు ఇలా..
ఎన్టీఆర్ జిల్లాలో ఒక ప్రభుత్వ, పది ప్రైవేటు ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడ్లలో 680 సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో సుమారుగా 944 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాల విజయవాడలో రమేష్‌బాబు హాస్పిటల్ రోడ్డులో ఉంది. ప్రైవేట్ కళాశాలలకు సంబంధించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఐటీఐ (గొల్లపూడి), సెయింట్ జోసఫ్ ఐటీఐ (గుణదల), జంపాల అన్నపూర్ణ ఐటీఐ (విజయవాడ), శ్రీ పద్మావతి ఐటీఐ (నందిగామ), వివేకానంద ఐటీఐ (విజయవాడ), సాయి కృష్ణ ఐటీఐ (తిరువూరు), శ్రీమతి ఈకే ఐటీఐ (జగ్గయ్యపేట), పీఎస్‌సీ బోస్ ఐటీఐ (నందిగామ), డోలూస్ ఐటీఐ (నందిగామ), నలంద ఐటీఐ (విజయవాడ) కళాశాలలు ఈ సంవత్సరం అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేశాయి.
ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఎన్టీఆర్ జిల్లాలో ఒక ప్రభుత్వ, పది ప్రైవేట్ కాలేజీలు వివిధ ట్రేడుల్లో అందుబాటులో 1,624 సీట్లు అడ్మిషన్ల రిజిస్ట్రేషన్లకు ఈ నెల 24 వరకు గడువు

పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన