నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి బుధవారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయవాడకు చెందిన ఎల్.నారాయణ కుటుంబం ఆలయ అధికారులను కలిసి రూ.1,01,116 విరాళం అందజేసింది. ఒంగోలుకు చెందిన డి.శివకృష్ణ ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
మహిళలకు ‘శక్తి’ యాప్‌తో రక్షణ
విజయవాడస్పోర్ట్స్: ఆపద సమయంలో మహిళలకు ‘శక్తి’ యాప్ రక్షణగా నిలుస్తుందని మహిళా పోలీస్‌స్టేషన్ ఏసీపీ లతాకుమారి సూచించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శక్తి యాప్ ఆవశ్యకతపై విద్యార్థినులు, గృహిణులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జి.కొండూరు గ్రామం, విజయవాడ నగరంలోని డెంటల్ కాలేజీ, సెంట్రల్ ఎకై ్సజ్ కాలనీలో మహిళా హాస్టల్, పలు ప్రధాన కూడళ్ల వద్ద విద్యార్ధినులు, గృహిణులకు మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది బుధవారం ఈ యాప్‌పై అవగాహన కల్పించారు. ఏసీపీ లతాకుమారి మాట్లాడుతూ.. మహిళలు, బాలికల రక్షణకు ఎన్నో చట్టా లున్నాయన్నారు. ఆపద సమయంలో మహిళలకు రక్షణగా నిలిచేందుకు శక్తి యాప్‌ను రూపొందించామన్నారు. ఈ యాప్‌ను ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని ఆపద సమయంలో సాయం పొందాలని సూచించారు. బాధితులు యాప్‌లో సమాచారం అందించిన పది నిమిషాల్లో పోలీస్ సాయం అందుతుందన్నారు.
ఎన్టీఆర్ జిల్లా ఇంటర్మీడియెట్ అధికారిగా ప్రభాకరరావు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌గా బి.ప్రభాకరరావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఆ పదవిలో కొనసాగిన సి.ఎస్.ఎస్.ఎన్.రెడ్డి కడపకు బదిలీపై వెళ్లారు. పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న రెడ్డికి జిల్లా ఇంట ర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఆయన ప్రమోషన్‌పై కడప అధికారిగా నియమితులయ్యారు. ఏలూరు జిల్లా నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న ప్రభాకరరావుకు ఎన్టీఆర్ జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన సి.ఎస్.ఎస్.ఎన్.రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు.
నిత్యాన్నదానానికి విరాళాలు
నిత్యాన్నదానానికి విరాళాలు


