థాయ్‌ల్యాండ్ టూ ఘంటసాల
ఘంటసాల: సమాజం సుఖశాంతులతో ఉండాలంటే గౌతమ బుద్ధుడి బోధనలు శరణ్యమని బౌద్ధ గురువు బంతే ధమ్మధజ థెరో అన్నారు. రూ.4 లక్షల విలువైన థాయ్‌ల్యాండ్ మెటల్, ఫైబర్‌తో తయారు చేసిన రెండు గౌతమ బుద్ధుడి విగ్రహాలు థాయ్‌ల్యాండ్ నుంచి బుధవారం ఘంటసాల గ్రామంలోని బుద్ధ విహార్‌కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బంతే ధమ్మ ధజ థెరో మాట్లాడుతూ.. ప్రత్యేకమైన బుద్ధుడి విగ్రహాలు థాయ్‌ల్యాండ్ నుంచి తొలుత ఓడలో చైన్నెకు చేరుకున్నాయని, అక్కడి నుంచి రైలు ద్వారా మచిలీపట్నం వచ్చాయని, అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో ఘంటసాల బుద్ధవిహార్‌కు తరలించామని తెలిపారు. ఈ విగ్రహాలను మే 12న జరిగే బుద్ధ జయంతి ఉత్సవాల్లో ప్రదర్శనకు ఉంచుతామని పేర్కొన్నారు. థాయ్ ల్యాండ్ నుంచి వచ్చిన బుద్ధుడి విగ్రహాలకు మచిలీపట్నం రైల్వే స్టేషన్‌లో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు దర్శించుకున్నారు. బంతే ధమ్మ ధజ థెరో ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఘంటసాల చేరుకున్న విగ్రహాలకు బౌద్ధ స్తూపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బుద్ధ విహార్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బుద్ధవిహార్‌కు చేరినగౌతమబుద్ధుడి విగ్రహాలు
థాయ్‌ల్యాండ్ టూ ఘంటసాల


