భక్తిశ్రద్ధలతో రంజాన్‌ ప్రార్థనలు | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో రంజాన్‌ ప్రార్థనలు

Apr 1 2025 12:00 PM | Updated on Apr 1 2025 12:00 PM

భక్తి

భక్తిశ్రద్ధలతో రంజాన్‌ ప్రార్థనలు

మచిలీపట్నంటౌన్‌: పవిత్ర రంజాన్‌ పండుగను ముస్లింలు సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నగరంలోని ముస్తాఖాన్‌పేటలో ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మౌలానా మొహమ్మద్‌ వాజీద్‌ హుస్సేన్‌ సాహెబ్‌ ప్రార్థనలు చేసి రంజాన్‌ పండుగ విశిష్టతను వివరించారు. ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనల్లో పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ షేక్‌ సలార్‌దాదా, ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ మహమ్మద్‌ సద్‌రుద్దీన్‌ ఖురేషి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ ముస్లింలకు వ్యతిరేకమైన వక్ఫ్‌ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు. కిట్టు ముస్లింలను ఆలింగనం చేసుకుని రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్‌ రఫీ, కార్యదర్శి అష్రఫ్‌భాషా, కోశాధికారి హనీఫ్‌, సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్పొరేటర్‌ గోపిశెట్టి సతీష్‌, వైఎస్సార్‌ సీపీ మైనారిటీ విభాగం నాయకులు షేక్‌ మహ్మద్‌ సాహెబ్‌, మహ్మద్‌ రఫీ తదితరులు పాల్గొన్నారు.

బాలకొండలరావుకుఘన సత్కారం

కూచిపూడి(మొవ్వ): ఉగాది వేడుకలు, వసంత నవ రాత్రోత్సవాలను పురస్కరించుకుని కూచిపూడి నాట్య కళాకారిణి, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఏ బాల కొండలరావు (విశాఖపట్నం)ను కూచిపూడి నాట్య క్షేత్రంలో సోమవారం ఘనంగా సత్కరించారు. కూచిపూడి శిల్పారామం వ్యవస్థాపకుడు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ వేదాంతం రాధేశ్యాం ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం జరిగింది. ఆల్‌ ఇండియా న్యూస్‌ పేపర్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షులు చలాది పూర్ణచంద్రరావు, దీవి శ్రీ రంగా చార్యులు, పిన్నమనేని గోపాల కృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఏ బాలకొండలరావ రావు శిష్యులతో పాటు పలువురు నాట్యకళాకారులు కూచిపూడి నాట్యాంశాలను ప్రదర్శించి, ప్రేక్షకులను మన్నలను అందుకున్నారు.

భక్తిశ్రద్ధలతో రంజాన్‌ ప్రార్థనలు 1
1/1

భక్తిశ్రద్ధలతో రంజాన్‌ ప్రార్థనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement