ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం వసతులు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం వసతులు

Nov 20 2026 1:07 AM | Updated on Nov 20 2026 1:07 AM

● కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం వసతులు కల్పించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం ఎంఈవోలు, హెచ్‌ఎంలు, సీఆర్‌పీలు, ఎంఐఎస్‌లతో అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, విద్యుత్‌, మూత్రశాలలు వంటి వసతులు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. యూడైస్‌ పోర్టల్‌లో పాఠశాలల వివరాలు నమోదు చేయాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు వందశాతం ఉండేలా ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఎంఈవోలు నిత్యం తమ పరిధిలోని పాఠశాలలను సందర్శించాలన్నారు. సమావేశంలో జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement