కాగజ్‌నగర్‌టౌన్: హైదరాబాద్‌లోని హైటెక్ గ్రౌండ్స్‌లో గురువారం నిర్వహించిన ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సమావేశంలో కేంద్ర ర వాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు కలిశారు. హైదరా బాద్– నాగ్‌పూర్ జాతీయ రహదారి నిర్మించా లని, చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న బెల్లంపల్లి– గడ్చిరోలి జాతీయ రహదారిని మంజూరు చేయాలని కోరారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. హైదరాబా ద్– నాగ్‌పూర్ జాతీయ రహదారి డీపీఆర్ దశలో ఉందని, త్వరలోనే నోటిఫై చేస్తామన్నారని, అలాగే బెల్లంపల్లి– గడ్చిరోలి జాతీయ రహదారి విషయంలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.


