విచ్చలవిడిగా మద్యం విక్రయాలు అనుమతులు లేకున్నా మందుబాబులకు అన్ని సౌకర్యాలు నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజాము వరకు అమ్మకాలు
ఆసిఫాబాద్‌క్రైమ్: జిల్లాలో బెల్టు షాపులు విస్తరిస్తున్నాయి. ఒకప్పుడు రహస్యంగా, పరిమితంగా సాగి న ఈ వ్యవహారం ప్రస్తుతం బహిరంగంగానే కొనసాగుతోంది. మండల కేంద్రాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులు వెలిశాయనే ఫిర్యాదులు అందుతున్నాయి. అన్ని రకాల మద్యం విక్రయించడమే కాకుండా మద్యంప్రియులకు అక్కడికక్కడే తాగేందుకు సకల సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ఎలాంటి అనుమతులు, లైసెన్సులు లేకుండానే రాత్రిపగలు మద్యం అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
పల్లెల్లోనూ విచ్చలవిడిగా..
పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ రోజురోజుకూ బెల్ట్ షాపులు విస్తరిస్తున్నాయి. మద్యం సులభంగా అందుబాటులో ఉండటంతో యువత బానిసలుగా మారుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ కూలీలు, రోజువారీ కూలీల కుటుంబాలపై అమ్మకాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గతంలో లైసెన్స్‌డ్ మద్యం దుకాణాలు నిర్ణీత సమయానికి మూతబడితే మద్యం దొరకడం కష్టంగా ఉండేది.. కానీ బెల్ట్ షాపులతో అర్ధరాత్రి, తెల్లవారుజామున వరకు కూడా మద్యం అందుబాటులో ఉంటోంది.
నిఘా ఎక్కడ?
బెల్ట్ షాపుల ద్వారా అనధికారికంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నా సంబంఽధిత ఎకై ్సజ్ అధికారుల పర్యవేక్షణ ఏ మేరకు ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విక్రయాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అధికారులకు తెలి యదా? తెలిసినా చర్యలు తీసుకోవడం లేదా? అనే అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం నిల్వలు ఏ ర్పాటు చేయడం, అనధికారికంగా విక్రయించడం, అనుమతి లేని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించడం వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
సకల సౌకర్యాలు కల్పిస్తూ..
జిల్లాలో లైసెన్స్‌డ్ మద్యం దుకాణాలు 32 ఉండగా, బార్లు 4 ఉన్నాయి. కాగజ్‌నగర్ డివి జన్ పరిధిలోని సిర్పూర్(టి), కౌటాల, బెజ్జూ ర్, దహెగాం, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట్, కాగజ్‌నగర్ మండలాలతోపాటు ము న్సిపాలిటీ పరిధిలో కొన్ని బెల్ట్ షాపులు ఏకంగా మినీ బార్లను తలపిస్తున్నాయి. భారీ సైజ్‌ల్లో ఫ్రిడ్జ్‌లు ఏర్పాటు చేసి వివిధ బ్రాండ్‌లకు చెందిన బీర్లు అందుబాటులో ఉంచుతున్నా రు. మద్యంప్రియులకు అక్కడ కూర్చోని తాగేందుకు అనువుగా కుర్చీలు, టేబుళ్లు, కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో అసలు ఇవి బెల్ట్ షాపులా? లేక ఎలాంటి అనుమతులు లేని మినీ బార్లా? అనే సందేహాలు కలుగుతున్నాయి. మరోవైపు కొన్ని బెల్ట్ షాపుల నిర్వాహకులైతే స్థానిక మద్యంతోపా టు నిషేధిత మహారాష్ట్ర దేశీదారు మద్యాన్ని సైతం అమ్ముతున్నారు.


