ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న పేషెంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో భాగంగా గురువారం ఆస్పత్రి ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఏఐ టీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్, ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాట్లాడుతూ కార్మికుల కనీస వేతనంగా రూ.26వేలు, ఏటా బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రెండు జతల యూనిఫాం, చట్ట ప్రకారం సెలవులు మంజూరు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గంగాధర్, మాధవి, సువర్ణ, సాంబాజీ, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.


